Home /News /crime /

THE DRUNKEN SON STABBED HIS FATHER AND SISTER ON SUSPICION OF MISAPPROPRIATION OF ASSETS FULL DETAILS HERE MDK PRV

Brutal attack: ఆస్తికోసం ఉన్మాదిలా మారిన కొడుకు.. మద్యం తాగి ఇంటికొచ్చి కన్న తండ్రి, సోదరిపై దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆస్తి కోసం ఓ కొడుకు ఉన్నాదిలా మారాడు. తండ్రి సోదరి తనకు ఆస్తులు సరిగా పంచివ్వలేదనే కోపంతో మద్యం తాగివచ్చి దారుణానికి ఒడిగట్టాడు.

  ప్రపంచంలో మరెవరి దగ్గర దొరకని ప్రేమ ఆప్యాయతలు తల్లితండ్రుల వద్దనే చూడగలం. బుడిబుడి అడుగులు వేస్తూన్నా చిన్నారికి చిన్ని గాయం అయితే తల్లి కళ్ళు చెమ్మగిల్లుతాయి. నాన్న హృదయం అల్లాడి పోతుంది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి... కొడుకు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే కన్నవారి ఆనందానికి అవదులు ఉండవు. తమ బిడ్డ పెద్దయ్యాక మనల్ని చూస్తాడో చుడడో తెలియదు. కుమారుడు ప్రయోజకుడు అయితే చాలు అనుకుంటారు. అందుకే తల్లితండ్రులను మించిన దైవం లేదంటారు పెద్దలు. నవ సమాజంలో ప్రత్యక్షంగా మనతో నివసించే దైవాలకన్నా.. వాళ్ల మరణానంతరం తీసుకెళ్లలేని డబ్బులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు సుపుత్రులు. కన్నా వారిని కాదని పైసా మే పరమాత్మ అంటున్నారు. డబ్బులు వస్తే చాలు కన్నవారు ఎలా ఉన్న పర్లేదు అనుకొనే ఎక్కువగా జీవిస్తున్న సమాజం ఇది. పేద., ధనికులు అనే తేడా లేకుండా ప్రత్యక్ష దైవాలను ఆనాధలు చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.

  రక్తం కారుతున్నా కనికరించకుండా..

  ఆస్తికోసం (For property) ఓ కొడుకు మద్యం సేవించి తండ్రి (father), సోదరిపై (Sister) కత్తితో దాడి చేశాడు (Attacked with knife). రక్తం కారుతున్నా కనికరించకుండా మళ్లీ దాడి చేశాడు. చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి దిగడంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా (Medak) రామంతాపూర్ పంచాయతీ పరిధి లింగారెడ్డి పల్లిలో చోటు చేసుకుంది.  ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (Narayana reddy), చంద్రకళ  (Chandrakala)దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు (Son) ఉన్నారు. పెద్ద కూతురు గతంలో చనిపోయింది.

  భూమి అమ్మడంతో వివాదం..

  చిన్న కూతురు ప్రవీణ భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. కాగా, ఆస్తి విషయమై కుమారుడు రాజశేఖర్ రెడ్డి (Rajashekar reddy) తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. ఆస్తి అమ్మిన డబ్బంతా (Total money) తనకే ఇవ్వాలంటూ వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేక ఇటీవల కొంత భూమిని అమ్మగా వచ్చిన డబ్బుల్లో సుమారు రూ.30 లక్షలు కుమారుడికి ఇచ్చినట్లు సమాచారం. మిగతా డబ్బులు కూడా తనకే ఇవ్వాలంటూ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు.

  ఈ క్రమంలో పథకం ప్రకారం ముందే తెచ్చిన పదునైనా కత్తితో (With knife) తండ్రి నారాయణ రెడ్డి, సోదరి ప్రవీణపై విచక్షణా రహి తంగా దాడి చేశాడు (Attacked brutally). కత్తి పోట్లతో భయబ్రాంతు లకు గురైన తండ్రి కూతురు (father and daughter) కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. అయినా కనికరం చూపకుండా మళ్లీ కత్తితో దాడి చేయగా అడ్డుకోబోయిన ఇద్దరు గ్రామస్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కొద్ది సేపటి తర్వాత అతడిని గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి చేగుంట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి కొడుకులను ఉరి వేసినా తప్పు లేదని అంటున్నారు గ్రామస్తులు .
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Attempt ot murder, Crime news, Medak

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు