Home /News /crime /

దారుణం.. అప్పుడే పుట్టిన చిన్నారిని కుక్కలు పీక్కుతినడంతో..

దారుణం.. అప్పుడే పుట్టిన చిన్నారిని కుక్కలు పీక్కుతినడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్థానికులు తిరువికానగర్ పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకునే సరికి ఆ శిశువు ప్రాణాలు విడిచింది. పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

    తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ మగబిడ్డను కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పెరంబూర్ రాఘవ రోడ్డులోని ఏరికరై వద్ద గుంపులుగా ఉన్న కుక్కలు ఓ మగబిడ్డను పీక్కుతింటున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తెరుకున్న స్థానికులు తిరువికానగర్ పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకునే సరికి ఆ శిశువు ప్రాణాలు విడిచింది. పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బిడ్డ పుట్టి అప్పటికీ కొన్ని గంటలే అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఇదిలావుంటే.. అసలు శిశువు ఇక్కడి ఏలా వచ్చింది?, ఏవరైనా తెచ్చి పడేశారా?.. ప్రాణాలతో వదిలేశారా..? లేకపోతే ప్రాణం పోయిన మృతదేహాన్ని పడేశారా? అన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Crime news, Stray dogs, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు