హోమ్ /వార్తలు /క్రైమ్ /

omicron variant: కొత్త కరోనా వైరస్​ వస్తోందని కుటుంబాన్నే చంపేసిన వైద్యుడు.. నిందితుడి  డైరీలో సంచలన విషయాలు

omicron variant: కొత్త కరోనా వైరస్​ వస్తోందని కుటుంబాన్నే చంపేసిన వైద్యుడు.. నిందితుడి  డైరీలో సంచలన విషయాలు

6. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ తల్లిదండ్రులు డిసెంబర్ 26న త‌మ కుమారుడు త‌ప్పిపోయ‌న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ తల్లిదండ్రులు డిసెంబర్ 26న త‌మ కుమారుడు త‌ప్పిపోయ‌న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  అయితే ప్రజల్లో ఈ వైరస్​పై భయం మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ భయమే ఇపుడు ఏకంగా ఓ కుటుంబాన్ని చంపేసే వరకు తీసుకొచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని భావిస్తున్న వేళ.. మరో కొత్త వేరియంట్ (Corona new variant) ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం మరో కొత్త SARS-CoV-2 వేరియంట్‌ను గుర్తించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వ్యాప్తిచెందుతున్న ఈ వేరియంట్‌ను 'ఆందోళనకరమైన వేరియంట్'గా (variant of concern) వర్గీకరించింది. దీనికి ఒమిక్రాన్ (Omicron) అని పేరు కూడా పెట్టింది. సౌత్ ఆఫ్రికాలోని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS-SA) సంస్థ  ఈ వేరియంట్‌ను గుర్తించింది. B.1.1.529 జినోమ్ కోడ్‌ ఉన్న ఈ వేరియంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.  అయితే ప్రజల్లో ఈ వైరస్​పై భయం మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ భయమే ఇపుడు ఏకంగా ఓ కుటుంబాన్ని చంపేసే వరకు తీసుకొచ్చింది. ఒమిక్రాన్‌ (omicron) భయంతో సుశీల్​ కుమార్​ అనే ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య, బిడ్డలను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ (Kanpur)లో ఈ విషాదం చోటు చేసుకుంది.

భార్య బిడ్డలకు సోకకూడదని హత్య..

కాన్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో సుశీల్‌ కుమార్‌ ఫోరెన్సిక్‌ వైద్యుడి (Doctor)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు (18), కుమార్తె(15) ఉన్నారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు తెలిసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన భార్య, బిడ్డలు మహమ్మారి బారిన పడి ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ముందుగానే చంపేస్తే మంచిదని ఆలోచించాడు. విచక్షణ మరచిపోయి.. అత్యంత దారుణంగా వారిని హత్య (murder) చేశాడు.

సోదరుడికి కాల్..

హత్య చేసిన అనంతరం  తన సోదరుడికి ఫోన్​ చేసి మొత్తం విషయం చెప్పాడు. దీంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫోన్‌ చేసి  విషయం (family murder) చెప్పాడు. అలర్ట్​ అయిన  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు.

డైరీలో సంచలన విషయాలు..

సంఘటన స్థలంలో పోలీసులుకు ఓ డైరీ (dairy), హత్యకు వాడిన సుత్తి లభించింది. మృతులను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డైరీ చదివిన పోలీసులు షాక్‌ అయ్యారు. దానిలో నిందితుడు తాను నయం కానీ ఓ జబ్బు (disease)తో బాధపడుతున్నట్లు రాసుకున్నాడు.

అలానే ‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron variant) చాలా ప్రమాదకరం. అది అందరిని చంపేస్తుంది. నా అజాగ్రత్త వల్ల నేను తప్పించుకోలేని ఓ ప్రమాదంలో చిక్కుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అందుకే వారిని ముందే సురక్షితమైన ప్రాంతానికి పంపాలి’’ అని రాసుకున్నాడు. డైరీ పరిశీలించిన పోలీసులు నిందితుడు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడికి కోసం గాలిస్తున్నారు

Published by:Prabhakar Vaddi
First published:

Tags: Corona, Doctors, Family dispute, Murder, Omicron, Omicron corona variant, Uttar pradesh

ఉత్తమ కథలు