ఫొటోలు దిగుతుండగా నీటిలో జారిపడి.. అన్నదమ్ముల మృతి..

హర్షవర్ధన్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా, ప్రేమ్ కుమార్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నారు. అయితే ఆదివారం తమ స్నేహితులతో కలిసి పెదఎరుకపాడులోని పంపుల చెరువు దగ్గర ఫొటోలు దిగేందుకు వెళ్లారు.

news18-telugu
Updated: June 1, 2020, 9:15 AM IST
ఫొటోలు దిగుతుండగా నీటిలో జారిపడి.. అన్నదమ్ముల మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్నేహితులతో కలిసి సరదాగా ఫొటోలు దిగేందుకని ఓ చెరువు దగ్గరకు అన్నదమ్ములు వెళ్లారు. ఫొటోలు దిగే సమయంలో అన్న నీటిలో జారిపడ్డాడు. అన్నను కాపాడేందుకు తమ్ముడు సైతం నీటిలోకి దూకడం.. ఈత రాకపోవడంతో అన్నదమ్ములిద్దరూ మరణించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుడివాడ పట్టణ పరిధిలోని మందపాడుకు చెందిన కొలుసు నరేంద్ర, రాధ దంపతులు. వీరికి హర్షవర్థన్(20), ప్రేమ్ కుమార్(18) కొడుకులు. హర్షవర్ధన్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా, ప్రేమ్ కుమార్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నారు. అయితే ఆదివారం తమ స్నేహితులతో కలిసి పెదఎరుకపాడులోని పంపుల చెరువు దగ్గర ఫొటోలు దిగేందుకు వెళ్లారు. అయితే ఫొటోలు దిగే సమయంలో చెరువు గట్టు ఏటవాలుగా ఉండడంతో హర్షవర్ధన్ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు.

తమ్ముడు ప్రేమ్ కుమార్ అన్నను కాపాడేందుకు చెరువులోకి దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. చెరువు గట్టుపై ఉన్న ఐదుగురు స్నేహితులు చెట్టు కొమ్మలు అందించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అన్నదమ్ములిద్దరూ నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలించి మృతదేహాలను బయటకుతీశారు. చేతికంది వచ్చిన కొడుకులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు రోదన వర్ణనాతీతంగా మారింది. అయితే ఈ చెరువులో ఇప్పటివరకు తొమ్మిది మందిపడి నీటిలో పడి చనిపోవడం గమనార్హం.
First published: June 1, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading