Home /News /crime /

Sad Incident: ఊహించని రీతిలో చావు ఈమెను పలకరించింది.. ఉదయాన్నే డ్యూటీకి వెళ్లగా..

Sad Incident: ఊహించని రీతిలో చావు ఈమెను పలకరించింది.. ఉదయాన్నే డ్యూటీకి వెళ్లగా..

కవిత (ఫైల్ ఫొటో)

కవిత (ఫైల్ ఫొటో)

చావు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. మృత్యువును తప్పించుకోవడం జరిగే పని కాదు. కానీ.. కొన్నిసార్లు ఊహించని రీతిలో చావు మనిషి ప్రాణాన్ని తీసుకెళ్లి పోతుంది.

    చెన్నై: చావు ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. మృత్యువును తప్పించుకోవడం జరిగే పని కాదు. కానీ.. కొన్నిసార్లు ఊహించని రీతిలో చావు మనిషి ప్రాణాన్ని తీసుకెళ్లి పోతుంది. అలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో జరిగింది. చెన్నై జనరల్ సెక్రటేరియట్ వద్ద 75 ఏళ్ల నాటి చెట్టు కూలి ఓ పోలీస్ కానిస్టేబుల్ మీద పడటంతో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ముత్తాళ్‌పేట్ ట్రాఫిక్ డివిజన్‌లో పనిచేస్తున్న కవితగా(40) గుర్తించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.

    తాండయపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె కొడుకు అరుణ్ కుమార్ సాలెం మహీంద్రా కాలేజ్‌లో చదువుతున్నాడు. 18 ఏళ్ల కూతురు స్నేహప్రియ బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కొడుకు విశాల్ 9వ తరగతి చదువుతున్నాడు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు