• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • THE DEAD BODY OF A FATHER KEPT HANGING IN A CLOSED ROOM FOR THREE DAYS AND THE CHILDREN KEPT BANGING ON THE DOOR SSR

Children: ‘ఆకలేస్తోంది.. తలుపు తీయండి.. నాన్నా’ అని పిల్లలు మూడు రోజులుగా ఎంత పిలిచినా..

ప్రతీకాత్మక చిత్రం

ఇజ్జత్‌నగర్‌లోని గాయత్రినగర్‌లో నివాసముండే మనోజ్ అలియాస్ చోటుకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఒక పాప, బాబు ఉన్నారు. భార్యతో గత కొంత కాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. మనోజ్ ఢిల్లీలో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కొన్నేళ్లుగా అక్కడే కుటుంబంతో పాటు కలిసి ఉండేవాడు.

  • Share this:
    బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఇజ్జత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇజ్జత్‌నగర్‌లోని గాయత్రినగర్ ప్రాంతంలోని ఎయిర్‌ఫోర్స్ స్ట్రీట్ నెంబర్.10లోని ఓ ఇంట్లో నివాసముంటున్న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తతో మనస్పర్థల కారణంగా భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ దంపతులకు ఆరేళ్ల వయసున్న బాబు, ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. అయితే.. పుట్టింటికి వెళుతూ పిల్లలను ఇద్దరినీ వదిలేసి ఆ తల్లి తన దారి తాను చూసుకుంది. భార్యతో గొడవపడిన భర్త నాలుగు రోజుల వరకూ పిల్లలను చూసుకుంటూ అలానే గడిపాడు. కానీ.. ఐదో రోజు తన గదిలోకి వెళ్లిన అతను పిల్లలను ఎంత పిలుస్తున్నా తిరిగి రాలేదు. తెలిసీతెలియని వయసులో ఉన్న ఆ చిన్నారులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. మూడు రోజులుగా పాప, బాబు ‘డాడీ.. డాడీ’ అని ఎంత పిలుస్తున్నా ఆ తండ్రి నుంచి సమాధానం లేదు. ఆ పిల్లలు ఆకలికి తట్టుకోలేక పక్కింటి వాళ్ల ఇంటికెళ్లి ఆకలికి ఉందని అడిగితే.. ఆ పక్కింటి వాళ్లు ఆరా తీయగా విషయం తెలిసింది. తలుపులు బద్ధలు కొట్టి చూడగా గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇజ్జత్‌నగర్‌లోని గాయత్రినగర్‌లో నివాసముండే మనోజ్ అలియాస్ చోటుకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఆరేళ్ల వయసున్న బాబు, ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. భార్యతో గత కొంత కాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి.

    మనోజ్ ఢిల్లీలో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కొన్నేళ్లుగా అక్కడే కుటుంబంతో పాటు కలిసి ఉండేవాడు. అయితే.. గతేడాది లాక్‌డౌన్ కారణంగా మనోజ్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో.. అప్పటి నుంచి భార్య, పిల్లలతో కలిసి ఢిల్లీ నుంచి సొంతూరు వచ్చి ఉంటున్నాడు. ఉద్యోగం కోల్పోవడంతో అప్పటి నుంచి మనోజ్ వేరే పని కూడా చూసుకోకుండా ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఏదో ఒక పని చూసుకోవాలని భార్య సలహా ఇచ్చింది. అయితే.. ఈ విషయంలోనే భార్యాభర్తలిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఐదు రోజుల క్రితం కూడా మనోజ్, అతని భార్య గొడవపడ్డారు. ఇక తాను ఈ ఇంట్లో ఉండలేనని, పిల్లలను చూసుకోవాలని.. పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి మనోజ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య గొడవ పడి వెళ్లిపోవడంతో మనోజ్ తీవ్ర మనస్తాపం చెందాడు.

    ఇది కూడా చదవండి: Sister in law: అతని వయసు 35 ఏళ్లు.. పెళ్లి కాలేదు.. తమ్ముడి భార్య అందరి ముందు తిట్టిందని ఎంతపని చేశాడంటే..

    రెండుమూడు రోజులు పిల్లలను బాగానే చూసుకున్నట్టుగా కనిపించాడు. బయటకు వెళ్లి సిగరెట్స్ కాల్చాడు. అలా ఇరుగుపొరుగు వారికి ఓ షాప్ దగ్గర సిగరెట్స్ కొనుగోలు చేస్తూ మనోజ్ చివరిగా ఆదివారం కనిపించాడు. ఆ తర్వాత.. అసలు బయటకే రాలేదు. ఇంట్లోనే బాధపడుతూ కూర్చున్నాడేమోనని ఇరుగుపొరుగు వాళ్లనుకున్నారు. కానీ.. మనోజ్ క్షణికావేశంలో పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన గదిలోకి వెళ్లి లోపల లాక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయం తెలియని చిన్నారులు ‘ఆకలిగా ఉంది.. తలుపు తీయండి నాన్నా’ అంటూ పలుమార్లు పిలిచారు. వాళ్ల నాన్న లోపలకు వెళ్లి లాక్ చేసుకున్నాడని మాత్రమే వారు అనుకున్నారు. ఆకలికి తట్టుకోలేక ఇంట్లో దొరికింది తిన్నారు. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకూ అలానే ఉన్నారు.

    మంగళవారం ఆకలికి తట్టుకోలేక ఆ పిల్లలిద్దరూ సాయంత్రం 5.30 గంటల సమయంలో పొరుగింటికి వెళ్లారు. ఆకలిగా ఉందని.. తినడానికి ఏమైనా ఉంటే పెట్టమని ఉసూరుమంటూ అడిగారు. ఆ పిల్లలిద్దరికి భోజనం పెట్టిన పొరుగింటి వాళ్లు.. తలుపులు ఎందుకు తీయడం లేదో చూద్దామని పిల్లలతో పాటు ఇంటికెళ్లారు. ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా లోపల మనోజ్ ఉరితాడుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఉద్యోగం కోల్పోవడం, భార్య కూడా వదిలేసి వెళ్లిపోవడంతో ఆ మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.

    అయితే.. మనోజ్ మృతదేహంపై గాయాలు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. హత్య చేసిన అనంతరం.. మనోజ్‌కు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై.. ఎస్‌ఐ సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక మనోజ్‌ది ఆత్మహత్య లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: