(K.Veeranna,News18,Medak)
కన్న పేగు బంధానికి ప్రతీకారం తీర్చుకున్న పేగుబంధం. ఏదంపతులు అయినా పిల్లలు కావాలని కలలు కంటారు. కన్న తర్వాత అల్లారు ముద్దుగా పెంచుకొని.. తమ జీవితానికి సార్ధకతను పొందుతారు. కానీ ఇక్కడ ఆ దంతపుల కన్న కూతురే అతి కిరాతంగా ప్రవర్తించింది. పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి వివాహం చేస్తే.. ఆస్తి కోసం తన తల్లినే పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా హవేళిఘన పుర్ మండలం తోగుట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొగుట గ్రామానికి చెందిన పుష్టి బాలమణి(50), కిషన్ దంపతులు. వారిద్దరికి మొదట సంతానం లేదు. చాలా రోజుల తర్వాత వాళ్లకు ఒక కూతురు జన్మించింది. ఆమె పేరును నర్సమ్మగా నామకరణం చేశారు. తర్వాత ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.
పెళ్లీడు కొచ్చింది కానీ.. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే.. కచ్చితంగా ఇల్లరికంగా అల్లుడు రావాలనే కండీషన్ పెట్టారు. తమకు తోడు ఎవరూ లేకపోవడంతో వాళ్లు ఇలాంటి కండీషన్ పెట్టారు. చివరకు ఆమెను అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ రోజు నుంచి వాళ్లు కూడా బాలమాణితో పాటే కలిసి ఉంటున్నారు. బాలమణి తన కూతుర్ని ఇల్లరికం ఉంచుకోవడంతో ఇంట్లోనే ఉంటోంది. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నారు. తర్వాత ఇంట్లో ఆస్తికి సంబంధించి తాగాదాలు ఎక్కువ అయ్యాయి. కూతురు కొద్ది రోజుల నుండి తల్లి పేరు మీద ఉన్న భూమిని తన పైకి మార్చమని కోరుతోంది. బాలామణి పేరుపై ఉన్న ఆస్తులను తమ పేరుపై రాయాలని ఎంతో ఒత్తిడి తీసుకొస్తుండేది.
ఇలా ఓ రోజు ఆస్తి గొడవ పెరిగి పెద్దదైంది. అందుకు నిరాకరించిన బాలమణిని కూతురు నరసమ్మ కక్ష పెంచుకుంది. నర్సమ్మ తన తల్లిని ఎలాగైనా చంపేసి ఆమె పేరిట ఉన్న ఆస్తిని రాబట్టుకోవాలని దురుద్దేశంతో పథకం రచించింది. ఆ రోజు కోసం ఎదురు చూసింది. తల్లిని ఇంటి మేడ పైన కూర్చోబెట్టి మద్యం తాగించి ఎవరూ లేని సమయంలో కిందికి తోసేసింది. అప్పటికీ బాలమణి ప్రాణంతో ఉండడంతో బండరాయితో మోది కట్టెలతో కొట్టి కిరాతకంగా చంపేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు గా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలన చేయగా కుక్కలు మృతురాలి కూతురు నరసమ్మ చుట్టూ తిరగడంతో ఆమె అక్కడి నుండి పారిపోయింది.
తర్వాత నర్సమ్మ కుమారుడి దగ్గరకు వచ్చి కుక్కలు ఆగాయి. ఇలా కుక్కలు ఆ బాలుడి వద్ద ఆగిపోవడంతో ఆ గ్రామంలో చర్చనీయాంశమైంది. దీంతో ఘటనా స్థలానికి డిఎస్పి సైదులు సి ఐ పాలవెల్లి కూడా వెళ్లారు. మృతురాలి సోదరుడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు నరసవ్వ ఆమె కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే స్వయంగా తన తల్లిని హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగి పోయినట్లు మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. కాగా ఆస్తి తగాదాలతో నే తల్లిని హత్య చేసినట్లు నరసవ్వ పోలీసుల విచారణలో ఒప్పు కున్నట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత... మీడియా ముందు ప్రవేశ పెడతామన్నా పోలీసులు ఆస్తి తగాదా విషయాలలో తరుచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయన్నారు. కొడుకులే కాల యముడు అనుకున్న రోజులో ఇవి . కూతురే ఇంటికి దీపం అని అంటున్నారు కానీ ఆస్తి కోసం కన్న తల్లిని చంపి కటకటాల పాలైన నరసవ్వ.. తన కుమారుడిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు గ్రామస్తులు . ఇలాంటి ఘటలు జరగడం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది .ఇలాంటి ఘటనలు జరుగాకుండా చూడాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.