అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఓ యువతిని గదిలో బంధించి...

ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి ఊరికి చివర ఉన్న ఓ పాడుబడిన బంగ్లాలో బంధించారు. అనంతరం కీచక సోదరులు ఇద్దరూ కలిసి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగలేదు....

news18-telugu
Updated: August 24, 2019, 7:45 PM IST
అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఓ యువతిని గదిలో బంధించి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇద్దరూ సొంత అన్నదమ్ములే..అయితే ఇద్దరి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఓ యువతిని గదిలో బంధించి లైంగిక దాడి చేసిన ఘటన బయటపడటంతో యావత్ సమాజం నివ్వెరపోయింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు గ్రామంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ, తరచూ అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఓ యువతిపై కన్నేశారు. ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి ఊరికి చివర ఉన్న ఓ పాడుబడిన బంగ్లాలో బంధించారు. అనంతరం కీచక సోదరులు ఇద్దరూ కలిసి ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగలేదు. ఆమెను అక్కడే బంధించి ప్రతిరోజు వచ్చి ఆమెను లైంగికంగా హింసకు గురి చేసేవారు. అలా వారం రోజులు గడిచిన తర్వాత ఆ యువతి అక్కడి నుంచి పరారై పోలీసులను ఆశ్రయించింది. ఘటన బయటపడటంతో పోలీసులు వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు అదుపులోకి తీసుకున్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>