చేపలు లూటీ చేస్తున్నారంటూ రివాల్వర్‌తో బెదిరింపు.. పరుగులు పెట్టిన గ్రామస్తులు

ప్రతీకాత్మక చిత్రం

ఓ చెరువులో కొంతమంది గ్రామస్తులు చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుకున్న కాంట్రాక్టర్ చెరువు వద్దకు వచ్చి కాలుస్తానంటూ రివాల్వర్‌తో హల్ చల్ చేశాడు.

  • Share this:
    ఓ రివ్వాలర్ నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టించింది. చెరువులో చేపలు లూటీ చేస్తున్నారంటూ గ్రామస్తులను ఓ కాంట్రాక్టర్ రివాల్వర్‌తో బెదిరించిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ వద్ద ఓ చెరువులో కొంతమంది గ్రామస్తులు చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుకున్న కాంట్రాక్టర్ చెరువు వద్దకు వచ్చి కాలుస్తానంటూ రివాల్వర్‌తో హల్ చల్ చేశాడు. దీంతో చేపలు పట్టేందుకు చెరువులోకి దిగిన వారు రివాల్వర్ చూడడంతో పరుగు పెట్టారు. పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిర్యాలగూడ రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మిర్యాలగూడకు చెందిన గాయం ఉపేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: