Home /News /crime /

THE CI DID NOT HAND OVER RS 43 LAKH TO GOVERNMENT WHICH IS RECOVERED FROM THE ATTACK ON POKER SITES IN BHADRADRI KOTHAGUDEM KMM PRV

Kothagudem CI: అక్కడ అందరూ పేకాట ఆడారు.. కానీ, మన పోలీస్ బాస్​ ఆడిన ఆట మాత్రం మామూలుగా లేదు.. ఎస్పీకే చిర్రెత్తుకొచ్చి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఓ పేకాట వ్యవహారం.. చినికి చినికి పెరిగి పెద్దదైంది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రముఖులకు ప్రెస్టీజ్‌గా మారిన ఈ వ్యవహారంలో పోలీసుల కక్కుర్తి సైతం బట్టబయలైంది. 

  (G Srinivasa Reddy, News18, Khammam)

  అందర్‌ బాహర్‌.. మూడు ముక్కలు (Three cards).. లోనబయటా.. ఇలా పలురకాల పేర్లతో ప్రాచుర్యం పొందిన పేకాటలోని ఓ స్టైల్‌ ఇది. ఎక్కడ ఎవరు దీన్ని రూపొందించారో తెలీదు కానీ.. సొమ్ములు పోయినా.. వచ్చినా నిమిషాల్లోనే.. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా ఆడే ఈ రకమైన పేకాటను (Poker) తమిళనాడులోని వెలియా, ఉలా, మనకాంత ప్రాంతాల్లో విరివిగా ఆడే ఈ రకమైన పేకాట (Playcards) పర్యాటకుల ద్వారా బాగా ప్రాచుర్యంలో ఉందని చెబుతారు. నిమిషాల్లో ఆటగాడి బతుకు చిత్రాన్ని తేల్చిపారేసే ఈ గేమ్‌ పట్ల పేకాటరాయుళ్లు చాలా క్రేజ్‌ చూపిస్తుంటారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా ఈ రకమైన పేకాటకు ఏజెన్సీలోని కుగ్రామాలు.. ఫాంహౌజ్‌లు వేదిక అవుతున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వరావుపేట ప్రాంతాలు పచ్చని ప్రకృతికి.. ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి. పామాయిల్‌, కొబ్బరి, కోకో, మామిడి, జామ, సపోటా ఇలా పలురకాల పండ్ల తోటల్లో సకల సౌకర్యాలతో కూడిన ఫాంహౌజ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వీకెండ్స్‌లో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు రావడం.. సరదాగా ఎంజాయ్‌ చేయడం.. ఎంచక్కా వెళ్లిపోవడం కామన్‌గా మారింది. అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఓ పేకాట వ్యవహారం.. చినికి చినికి పెరిగి పెద్దదైంది. అధికార పార్టీకి చెందిన పలువురు ప్రముఖులకు ప్రెస్టీజ్‌గా మారిన ఈ వ్యవహారంలో పోలీసుల (Police) కక్కుర్తి సైతం బట్టబయలైంది.

  భద్రాద్రికొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ వ్యవసాయక్షేత్రాల్లోని ఓ ప్రదేశానికి ఖమ్మం (Khammam), గుంటూరు, ఏలూరు, విజయవాడ, సత్తుపల్లికి చెందిన పలువురు ప్రముఖులు వచ్చి పేకాడుతున్నారు(Playing cards). పక్కా సమాచారం అందుకున్న అశ్వారావుపేట సీఐ ఉపేంద్రరావు తన సిబ్బందితో కలసి దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు.. డబ్బు.. సెల్‌ఫోన్లు, వాహనాలు అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో సత్తుపల్లికి చెందిన ఓ ఆన్‌లైన్‌ బుకీ (Online bookie)తన పరిచయాలను ఉపయోగించి కేసు (Case) లేకుండా మాట్లాడాడు. దీనికిగానూ ఎవరి వస్తువులు వారికే అన్నీ ఇచ్చేట్టుగా.. దొరికిన డబ్బు మాత్రం పోలీసులు (Police) తీసుకునేట్టుగా మాట్లాడుకున్నారు. ఇలారూ. 33.5 లక్షలు పోలీసులు తీసుకున్నట్టు చెబుతున్నారు.

  ఈ సారి గన్​మెన్ల వంతు..

  అయితే ఇది జరిగిన మరుసటి రోజున సీఐ( CI)కి చెందిన గన్‌మెన్లు (Gunmen) మళ్లీ ఆ ఫాంహౌజ్‌ (farmHouse) పైన దాడి చేశారు. అక్కడే ఉన్న గుంటూరుకు చెందిన ఓ పొగాకు వ్యాపారికి చెందిన రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరోసారి బుకీ ద్వారా సీఐ (CI)తో మాట్లాడిన నిర్వాహకులు.. రూ.6.5 లక్షలు మాత్రం వెనక్కు తీసుకోగలిగారు. అయితే ఈ వ్యవహారం స్థానిక నేతల ద్వారా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు తెలిసింది. ఆయన వాకబు చేయడంతో ఇది ఓ పెట్టీ కేసు అని.. కేవలం మూడున్నర లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు నమ్మబలికారు.

  ఎస్​ఐ గారికి కోపం రావడంతో..

  ఇదంతా ఒకెత్తయితే పేకాట స్థావరంపై దాడి చేసిన విషయం అసలు స్థానిక ఎస్సైకి తెలియదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో తనకు తెలీకుండా తన పరిధిలోని పేకాట స్థావరంపై దాడిచేయడం.. ఏంటి..? ముప్పై మూడున్నర లక్షలు స్వాధీనం చేసుకుని మూడున్నర లక్షలు అని చెప్పడం ఏంటన్న దానిపై కినుక వహించిన ఎస్సై తన ఆవేదనను పై అధికారితో పంచుకున్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఎస్పీ సునీల్‌దత్‌ (SP Sunil duth) దాకా వెళ్లింది. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్వాధీనం చేసుకున్న మొత్తం విషయంలో వచ్చిన తేడాకు గానూ సీఐకి ఛార్జి మెమో (Charge memo) జారీ చేశారు. తన పరిధిలో పేకాట ఆడుతున్నా పట్టించుకోకపోవడంపై ఎస్సైకి (SI) షోకాజ్‌ జారీ చేశారు. ఇంకా సీఐ గన్‌మెన్ల పైనా చర్యలకు ఉపక్రమించినట్టు చెబుతున్నారు. పోలీసుశాఖ ప్రతిష్టను దిగజార్చిన ఈ వ్యవహారంలో ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. పోలీసుల కక్కర్తి.. పంపకాల్లో వచ్చిన తేడాలు ఎక్కడకు దారితీశాయో మరోసారి రుజువు చేసింది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrari kothagudem, Khammam police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు