హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad story: అయ్యో ఎంతటి విషాదం.. చిన్నారి అక్షరాభ్యాసానికి వెళ్లి కుటుంబం తిరిగి వస్తుండగా.. 

Sad story: అయ్యో ఎంతటి విషాదం.. చిన్నారి అక్షరాభ్యాసానికి వెళ్లి కుటుంబం తిరిగి వస్తుండగా.. 

వికాస్​ రెడ్డి కుటుంబం (ఫైల్​)

వికాస్​ రెడ్డి కుటుంబం (ఫైల్​)

అభం శుభం తెలియని ఓ పసి పాప తండ్రి అజాగ్రత్తకు మృత్యుఒడికి చేరింది. అక్షరాభ్యాసం కోసం బాసరకు వెళ్లి తిరుగు ప్రయాణం లో అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న చిన్నారి శాశ్వత నిద్రలోకి జారుకుంది.

(K. Veeranna, News 18, Medak)

అభం శుభం తెలియని ఓ పసి పాప తండ్రి అజాగ్రత్తకు మృత్యుఒడికి చేరింది. అక్షరాభ్యాసం కోసం బాసర (Basara)కు వెళ్లి తిరుగు ప్రయాణం లో అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న చిన్నారి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కళ్ల ముందే చిన్నారి విగతజీ విగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. 44వ జాతీయ రహదా రిపై  (National Highway 44)జరిగిన కారు ప్రమాదంలో (Road accident) ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మెదక్ జిల్లా చేగుంట ఎస్ఐ ప్రకాశ్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ (Hanmakonda) జిల్లా హసన్పర్తి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన వికాస్ రెడ్డి తన కుటుంబంతో హైదరాబాద్ (Hyderabad) లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో భార్య ప్రవల్లిక, ఇద్దరు కూతుర్లు సాన్విక, ఏడాదిన్నర అద్విక, మరోవ్యక్తితో కలిసి బాసర సరస్వతి ఆలయానికి అక్షరాభ్యాసం (Aksharaabhyasam) కోసం తన కారులో వెళ్లారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి హైదరాబాద్ వెళ్తుండగా మాసాయిపేట మండలం స్టేషన్ మాసాపేట శివారు 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. అయితే కారులోంచి రోడ్డుపై పడిన చిన్నారి అద్విక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృ తి చెందింది. మిగతా వారికి గాయాలయ్యాయి. వికాస్ రెడ్డి సోదరుడు విపుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు. విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి

అతివేగం, అజాగ్రత వల్లే కారు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో అప్పటివరకు తల్లి చెంతనున్న చిన్నారి అద్విక ఒక్కసారిగా ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలపాలై మృత్యుడికి చేరింది.

అక్షరాభ్యాసానికి అక్కడికే ఎందుకు?

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఇలా అక్షరాభ్యాసం చేయిస్తే.. భవిష్యత్తులో చదువు బాగా వస్తుందనే నమ్మకం. అందుకే ఇలా సరస్వతి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేయిస్తారు.

First published:

Tags: Basara, Medak, Road accident