వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య..

వివాహితను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి రాత్రి సమయంలో ఆ యువకుడు కిషోర్ వివాహితను తీసుకుని కాలనీకి చేరుకున్నాడు. ఈ విషయమై వివాహిత భర్త బాబు, అతడి మిత్రుడు మారుతితో కలిసి కిషోర్‌ను నిలదీశారు.

news18-telugu
Updated: May 28, 2020, 4:56 PM IST
వివాహేతర సంబంధం.. యువకుడి దారుణ హత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సమాజంలో రోజురోజూకీ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే హత్యలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో కిషోర్ అనే యువకుడు ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే బుధవారం ఆ వివాహితను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి రాత్రి సమయంలో ఆ యువకుడు కిషోర్ వివాహితను తీసుకుని కాలనీకి చేరుకున్నాడు. ఈ విషయమై వివాహిత భర్త బాబు, అతడి మిత్రుడు మారుతితో కలిసి కిషోర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. అందులో భాగంగానే మారుతి అనే యువకుడు కిషోర్ తలపై బండరాయితో కొట్టడంతో కిశోర్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: May 28, 2020, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading