Home /News /crime /

THE BROTHER POURED PETROL ON HIS TWO YOUNGER BROTHERS AND SET THEM ON FIRE IN KHAMMAM PRV

Khammam: ఖమ్మంలో దారుణం.. తమ్ముళ్లపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన అన్న.. 

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లు ముగ్గురు వరుసకు సోదరులు. చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. చిన్నప్పటి నుంచి కలిసే తిరిగారు. ఆడీ పాడీ చిందులేసేవారు. అయితే వాళ్ల మధ్యలోకి కుటుంబ గొడవలు రావడంతో ఇద్దరిపై హత్యాయత్నానికి దారితీసింది.

    వాళ్లు ముగ్గురు వరుసకు సోదరులు. చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. చిన్నప్పటి నుంచి కలిసే తిరిగారు. ఆడీ పాడీ చిందులేసేవారు. అయితే వాళ్ల మధ్యలోకి కుటుంబ గొడవలు రావడం ఇద్దరిపై హత్యాయత్నానికి దారితీసింది.  వివరాల్లోకి వెళితే.. ఇంటి స్థలం వివాదం ఇద్దరు సోదరులు (Brothers) కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అది పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. గొడవలు ఎక్కువ కావడంతో పెద్దోడి కుమారుడు పగతో రగిలిపోయాడు. ఎలాగైనా చిన్న బాబాయ్ కుటుంబంపై కక్ష తీర్చుకోవాలని అదను కోసం ఎదురు చూశాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నాన్న కుమారులపై పెట్రోల్ పోసి (Petrol Poured) నిప్పంటించాడు. ఈ క్రమంలో అతడికీ మంటలు అంటుకున్నాయి.

    ఖమ్మం (Khammam) జిల్లాలోని 39వ డివిజన్ మేదర బజారుకు చెందిన కోనా శ్రీనివాసరావు, కోనా చిలకారావు సోదరులు. వీరు ఉంటున్న ఇళ్లకు సమీపంలోని ఓ ఇంటి స్థలం (Land dispute) విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో సంవత్సరం క్రితం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దాంతో అప్పటి నుంచి  చిలకారావు కుమారుడు ఉమా రాజశేఖర్ (Uma Raja Shekar) పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన బాబాయ్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని రాజశేఖర్​ నిర్ణయించుకున్నాడు.



    ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో..

    అయితే శ్రీనివాసరావు  గురువారం సాయంత్రం వేళ ఇంట్లో లేడు. ఆయన కుమారులు భార్గవ్ (15), వీరేందర్ (12) అప్పుడే పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చారు. అయితే పుస్తకాలు కావాలని వాళ్ల అమ్మను అడిగారు. దాంతో బుక్స్​ కొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. వాళ్ల తల్లి బయటకి వెళ్లడం గమనించిన రాజశేఖర్ (Rajasehkar) పెట్రోల్ తీసుకుని శ్రీనివాసరావు ఇంట్లోకి వెళ్ళాడు. టీవీ చూస్తున్న పిల్లలు భార్గవ్, వీరేందర్ లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు దుర్మార్గుడు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకుని కాలిపోతూ గట్టిగా కేకలు వేశారు.

    అయితే పెట్రోలు పోసి నిప్పంటించే క్రమంలో ఉమాశంకర్ కు కూడా మంటలు అంటుకున్నాయి. దాంతో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారి కేకలు విన్న స్థానికులు మంటలను ఆర్పి, ముగ్గురిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురి శరీరం సుమారు 70 శాతం కాలిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపించడంతో గ్యాస్ సిలిండర్ పేలి, మంటల తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న పిల్లల వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న పిల్లల నుంచి జడ్జి శాంతిలత వాంగ్మూలం తీసుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attempt to murder, Brother kills, Crime news, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు