హోమ్ /వార్తలు /క్రైమ్ /

విషాదం.. తల్లి టీవీ చూడొద్దన్నందుకు బాలుడు..

విషాదం.. తల్లి టీవీ చూడొద్దన్నందుకు బాలుడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాలలు మూతపడడం కారణంగా నిత్యం ఇంటిలోనే టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఎప్పుడూ టీవీ ఎందుకు చూస్తున్నావని, వ్యవసాయ పనులకు రావాలంటూ మందలించింది.

కరోనా వైరస్ మహమ్మారి సోకితే ప్రాణాప్రాయ స్థితిలోకి వెళ్లడం కాదు. సోకకపోయిన ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలన్నింటినీ గత నాలుగైదు నెలలుగా పూర్తిగా మూసేశారు. దీంతో విద్యార్థులు ఇంటి పట్టునే ఉంటున్నారు. పాఠశాలల కొనసాగే సమయంలో హోంవర్క్, చదవడం, పరీక్షలంటూక్షణం టీవీ చూసే తీరిక ఉండేది. కానీ నాలుగైదు నెలలుగా పాఠశాలలు మూతపడడం.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటిలో నుంచి బయట తిరిగే పరిస్థితులు లేకుండాపోయాయి. దీంతో విద్యార్థులు అధికశాతం మంది టీవీలకే అతుక్కుపోతున్నారు. అయితే ఓ తల్లి తన కొడుకును తరచూ టీవీ చూడొద్దని మందలించింది. దీంతో విద్యార్థి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కమ్మరిపేటతండా(వట్టిమల్ల)కు చెందిన మాలోతు శ్రీరామ్, సుశీల భార్యభర్తలు.

వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కొడుకు అశోక్(13) తొమ్మిదో తరగతి పూర్తయ్యి.. పదో తరగతిలో అడుగు పెట్టబోతున్నాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాలలు మూతపడడం కారణంగా నిత్యం ఇంటిలోనే టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఎప్పుడూ టీవీ ఎందుకు చూస్తున్నావని, వ్యవసాయ పనులకు రావాలంటూ మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అశోక్ మధ్యాహ్నాం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Karimangar, Suicide

ఉత్తమ కథలు