Minor Girl: రెండు రోజులుగా వంతెనపై వేలాడిన బాలిక మృతదేహం.. అసలేమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Minor Girl: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో 17 ఏళ్ల మైనర్‌ బాలిక మృతదేహం రెండు రోజుల నుంచి రైల్వే వంతెన కింద వేలాడడం సంచలనం సృష్టించింది. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం రెండు రోజుల నుంచి గంటల తరబడి వంతెనపై వేలాడటం సంచలనం స్పష్టించింది. ఆమె జీవన శైలి నచ్చకనే బాలిక తాత మరియు ఇద్దరు మేనమామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎవరకీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైల్వే వంతెనపై నుంచి విసిరేద్దామనుకొని విసిరారు. కానీ ఆ మృతదేహాం రైల్వే బ్రిడ్జి కింద కాళ్లు వంతెనకు తగిలి ముఖం కిందకు వేలాడుతూ రెండు రోజుల పాటు అలాగే ఉంది. ఇది గమనించని వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అటు పక్కగా వెళ్లిన స్థానికులు దానిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల మైనర్‌ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్‌ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు.

  ఆమె చేసే ప్రతీ పనిపై ఎదో ఒక విధంగా అడ్డు చెబుతూ వచ్చేవాళ్లు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత మరియు ఇద్దరు మేనమామలు రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిపోయారు. దీంతో వాళ్లు తల్లికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోవడంతో డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేయగా.. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద భాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని వాళ్ల తాత, ఇద్దరు మేనమామలు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది.

  అప్పటి నుంచి ఆ మృతదేహం అక్కడే వేలాడుతూ ఉంది. తర్వాత రోజున స్థానికుల బ్రిడ్జి వైపు వెళ్లారు. దానిని చూసి వాళ్లు మొదట బొమ్మ అనుకొని పొరబడ్డారు. తర్వాత దగ్గరకు వెళ్లి చూడగా ఓ బాలిక శవంగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యప్తు చేస్తున్నామని డియోరియా పోలీసు చీఫ్ శ్రీపతి మిశ్రా తెలిపారు.
  Published by:Veera Babu
  First published: