Home /News /crime /

Shocking: ఉదయాన్నే నీళ్లు రావట్లేదు.. ట్యాంక్ మూత తీసి చూడమని కూతురికి చెప్పిన తల్లి.. చూసి భయంతో కేకలేసిన కూతురు..!

Shocking: ఉదయాన్నే నీళ్లు రావట్లేదు.. ట్యాంక్ మూత తీసి చూడమని కూతురికి చెప్పిన తల్లి.. చూసి భయంతో కేకలేసిన కూతురు..!

ఘటన జరిగిన ఇల్లు

ఘటన జరిగిన ఇల్లు

హర్యానాలోని యమునానగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి అక్క గదిలో పడుకున్న చెల్లెలు తెల్లారేసరికి ఇంటి పైనున్న వాటర్‌ట్యాంక్‌లో శవమై కనిపించింది. కలలో కూడా ఊహించని ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయింది. ఆ బాలిక తల్లిదండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

ఇంకా చదవండి ...
    యమునానగర్: హర్యానాలోని యమునానగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాత్రి అక్క గదిలో పడుకున్న చెల్లెలు తెల్లారేసరికి ఇంటి పైనున్న వాటర్‌ట్యాంక్‌లో శవమై కనిపించింది. కలలో కూడా ఊహించని ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయింది. ఆ బాలిక తల్లిదండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

    ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యమునానగర్ జిల్లాలోని ఓ గ్రామంలో తన్వీ (17) అనే బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక చెల్లి, అక్క ఉన్నారు. ఆమె అక్కకు వివాహమైంది. అక్క భర్త కూడా ఆ కుటుంబంతో పాటే కలిసి ఉంటున్నాడు.

    రెండు పోర్షన్‌ల ఇల్లు కావడంతో పై పోర్షన్‌లో ఆమె అక్కాబావ, కింద పోర్షన్‌తో తల్లిదండ్రులు, సదరు బాలిక, ఆమె చెల్లి కలిసి ఉండేవారు. కింద పోర్షన్‌లో టీవీ లేకపోవడంతో అందరూ పై పోర్షన్‌కి వెళ్లి టీవీ చూసేవారు. అయితే.. తన్వీ మాత్రం రాత్రి పొద్దుపోయే వరకూ టీవీ చూస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో కిందకు వెళ్లకుండా అక్క గదిలోనే పడుకుని నిద్రపోయేది. ఉదయాన్నే నిద్ర లేచి కిందకు వెళ్లేది. అలాగే గత శుక్రవారం రాత్రి కూడా తన్వీ అక్క వాళ్లింట్లో టీవీ చూస్తూ కూర్చుంది. కిందకు వెళ్లి నిద్రపోదామని తల్లి పిలిచినా ఆమె కిందకు వెళ్లలేదు. ‘నువ్వెళ్లు.. నేను టీవీ చూడటం అయిపోయాక అక్క గదిలోనే పడుకుని నిద్రపోతా’ అని తల్లికి చెప్పింది. దీంతో.. తన్వీ అమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కిందకు వెళ్లి పడుకున్నారు.

    ఉదయాన్నే ‘తన్వీని కిందకు రమ్మనమ్మా’ అని ఆమె తల్లి కింద నుంచి ఆమె పెద్ద కూతురికి చెప్పింది. తన్వీ రాత్రే కిందకు వచ్చిందని ఆమె చెప్పడంతో తల్లికి ఏం అర్థం కాలేదు. ఇంతలో ఇంట్లో ఎక్కడ వాటర్ ట్యాప్ తిప్పినా నీళ్లు రావడం లేదు. ట్యాంకులో నీళ్లున్నా ఉదయాన్నే నీళ్లు రాకపోవడం ఏంటని కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉన్నారు. ‘ట్యాంక్ మూత తీసి చూడమ్మా.. ఏమైనా అడ్డు పడ్డాయామో.. నీళ్లు రాకుండా’ అని తన్వీ తల్లి ఆమె చిన్న కూతురిని పైకి పంపించింది. వాటర్ ట్యాంకు మూత తీసి చూసిన చిన్నమ్మాయి భయంతో ‘అమ్మా’ అంటూ కేకలేసింది.

    ఇది కూడా చదవండి: OMG: ఏందోలే.. రోజులు ఎలా తయారయ్యాయో చెప్పడానికి ఈ ఒక్క వార్త చాలదా.. వీళ్లిద్దరి యవ్వారం ఏందో తెలిస్తే..

    కంగారుగా పైకెళ్లిన కుటుంబ సభ్యులు ఏమైందా అని ట్యాంకులో చూడగా తన్వీ విగత జీవిగా లోపల కనిపించింది. తాను చూస్తుండగానే కిందకు వెళ్లిన తన్వీ ఎప్పుడు మళ్లీ పైకొచ్చిందో, లేకపోతే ఎవరైనా చంపేసి ట్యాంకులో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో అర్థం కావడం లేదని ఆమె అక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన్వీని వెంటనే బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక ఆమెది ఆత్మహత్య లేక హత్యా అన్న విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Dead body, Haryana, Minor girl

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు