హోమ్ /వార్తలు /క్రైమ్ /

29Yr Old Woman: ‘నైట్‌కు రేటెంత’ అని అడుగుతున్నారు.. ఈమె ‘కాల్ గర్ల్’ కాదు.. కానీ ఇలాంటి కాల్స్ ఎందుకొస్తున్నాయంటే..

29Yr Old Woman: ‘నైట్‌కు రేటెంత’ అని అడుగుతున్నారు.. ఈమె ‘కాల్ గర్ల్’ కాదు.. కానీ ఇలాంటి కాల్స్ ఎందుకొస్తున్నాయంటే..

బాధిత మహిళ

బాధిత మహిళ

అతను ముంబైకి చెందిన బిజినెస్‌మాన్. పేరు దిలీప్ జైన్. మూడేళ్ల క్రితం విరార్‌కు చెందిన ఓ మహిళతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కానీ.. ఆ మహిళను సదరు వ్యాపారవేత్త మాత్రం ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడు. ఎంతలా అంటే.. పోలీసు కేసులను కూడా పట్టించుకోకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నాడు.

ఇంకా చదవండి ...

ముంబై: అతను ముంబైకి చెందిన బిజినెస్‌మాన్. పేరు దిలీప్ జైన్. మూడేళ్ల క్రితం విరార్‌కు చెందిన ఓ మహిళతో రిలేషన్‌లో ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కానీ.. ఆ మహిళను సదరు వ్యాపారవేత్త మాత్రం ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడు. ఎంతలా అంటే.. పోలీసు కేసులను కూడా పట్టించుకోకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నాడు.

ఆమెతో బంధం చెడగానే.. ఆ మహిళ పరువు తీసే ఉద్దేశంతో ఆమె నగ్న ఫొటోలను, నగ్న వీడియోలను సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఆ సమయంలో బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఆ తర్వాత కూడా ఆ మహిళకు, ఆమె కుటుంబానికి దిలీప్ నుంచి వేధింపులు తప్పలేదు. గత సంవత్సర కాలంగా కేవలం ఆ మహిళను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో దిలీప్ ఆమెకు 65,000 ఫోన్ కాల్స్ చేశాడంటే ఆమెను ఎంతలా టార్చర్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ను క్రియేట్ చేసిన దిలీప్.. బాధిత మహిళ ఫొటోను అందులో పోస్ట్ చేసి.. ‘కాల్ గర్ల్’ అని తప్పుడు ప్రచారానికి దిగాడు.

దిలీప్ జైన్

ఆమె నంబర్‌ను చాలామందికి పంపించాడు. తనను దిలీప్ హింసిస్తున్న తీరుపై బాధిత మహిళ స్పందించింది. దిలీప్ గతంలో ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడని, ఈ సంవత్సరం ఇన్‌స్టాగ్రాంలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన ఫొటోను, నంబర్‌ను అందులో పెట్టి ‘కాల్ గర్ల్’ అని పెడుతున్నాడని ఆ 29 సంవత్సరాల మహిళ చెప్పింది. ఫిబ్రవరి 28న ఈ ఫేక్ ప్రొఫైల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విరార్ పోలీసులు దిలీప్‌పై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారని.. ఆ ఫేక్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారని తెలిపింది. ఇప్పుడు మళ్లీ ఇన్‌స్టాగ్రాంలో మరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన నంబర్, ఫొటో పెట్టి.. కాల్ గర్ల్ అని మెన్షన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Very Sad: ఎంతపని చేశావ్ బ్రదర్.. ఇలా మధ్యలో వెళ్లిపోవడమే తప్పు.. మరీ ఇలాంటి కారణంతో వెళ్లడం..

సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయడం నిమిషం పట్టదని, కానీ పదేపదే ఫిర్యాదు చేయడంతోనే రోజంతా గడచిపోతోందని.. ఈ సమస్యకు తుది పరిష్కారం ఏంటో తెలియడం లేదని బాధిత మహిళ నిట్టూర్చింది. ‘కాల్ గర్ల్’ నంబర్ అంటూ తన నంబర్‌ను పోస్ట్ చేయడం వల్ల చాలామంది కాల్ చేసి దారుణంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నైట్‌కు రేటెంత’ అని అసభ్యంగా మాట్లాడుతున్నారని.. మెసేజ్‌లు కూడా పంపించి.. ‘ఎంత తీసుకుంటున్నావ్’ అని అడుగుతున్నారని.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో పాలుపోవడం లేదని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక.. దిలీప్ జైన్‌పై కేవలం ఈ మహిళను హింసిస్తున్న కారణంగా ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జనవరి 28, 2018న దిలీప్ జైన్‌పై తొలి వేధింపుల కేసు నమోదైంది. ఎన్ని కేసులు నమోదవుతున్నా.. ఏదో ఒక విధంగా బయటపడుతూ దిలీప్ ఆ మహిళను వేధిస్తూనే ఉన్నాడు.

First published:

Tags: Businessman, Crime news, Mumbai crime, Women harrasment

ఉత్తమ కథలు