Agra: డబ్బు కోసం ఫ్రెండ్‌ని చంపేశారు.. కరోనాతో పోయాడని కర్మకాండలు కూడా చేశారు.. కానీ ఎలా దొరికిపోయారంటే..

పోలీసుల అదుపులో నిందితులు

ఆగ్రాకు చెందిన కోల్డ్ స్టోరేజ్ యజమాని సురేష్ చౌహాన్ కుమారుడు సచిన్ చౌహాన్(23) జూన్ 21 నుంచి కనిపించలేదు. దీంతో.. ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో సచిన్ చౌహాన్ తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి సచిన్ దారుణ హత్యకు గురయ్యాడు.

  • Share this:
    ఆగ్రా: ఆగ్రాకు చెందిన కోల్డ్ స్టోరేజ్ యజమాని సురేష్ చౌహాన్ కుమారుడు సచిన్ చౌహాన్(23) జూన్ 21 నుంచి కనిపించలేదు. దీంతో.. ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో సచిన్ చౌహాన్ తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి సచిన్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో సచిన్‌ను హత్య చేసింది అతని క్లోజ్ ఫ్రెండ్ హర్ష్ చౌహాన్(24), మరో నలుగురని తేలింది. హర్ష్ చౌహాన్ తండ్రి, సచిన్ చౌహాన్ తండ్రి వ్యాపారంలో భాగస్వాములు. ఈ క్రమంలోనే.. సచిన్‌కు, హర్ష్‌కు స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలోనే హర్ష్ ఫ్రెండ్ అయిన సచిన్ అశ్వని(32) అనే యువకుడితో కూడా సచిన్ చౌహాన్‌కు స్నేహం కుదిరింది.

    అశ్వనికి ఆగ్రాలోని దయాల్‌బాగ్ ప్రాంతంలో ఓ స్పోర్ట్స్ క్లబ్ ఉంది. సచిన్, హర్ష్ తరచుగా ఆ స్పోర్ట్స్ క్లబ్‌లోనే కలుస్తుండేవారు. అశ్వనితో ఏర్పడిన స్నేహంతో సచిన్ చౌహాన్ అతని దగ్గర అప్పుడు కాస్త, అప్పుడు కాస్త అప్పు చేశాడు. ఆ అప్పు మొత్తం రూ.40 లక్షలైంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని అశ్వని పలుమార్లు అడిగినప్పటికీ సచిన్ చౌహాన్ అందుకు ఆసక్తి చూపలేదు. దీంతో.. అశ్వని, హర్ష్ కలిసి సచిన్ చౌహాన్‌ను కిడ్నాప్ చేసి అతని తండ్రికి ఫోన్ చేసి రూ.2 కోట్లు డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశారు. జూన్ 21న సచిన్ చౌహాన్‌కు కాల్ చేసిన అశ్వని ఖాస్‌పూర్ గ్రామంలో ఓ చోట పార్టీ చేసుకుంటున్నామని, రావాలని సచిన్ చౌహాన్‌ను కోరాడు. అక్కడే సచిన్‌ను నిందితులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

    సచిన్ చౌహాన్ ముఖానికి ప్యాకేజింగ్ టేప్‌ను చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్య అనంతరం కమలానగర్‌లోని ఓ మెడికల్ షాప్‌లో పీపీఈ కిట్లను కొనుగోలు చేసి బాల్కేశ్వర్‌లో సచిన్ మృతదేహానికి మారుపేరు పెట్టి కరోనాతో చనిపోయాడని చెప్పి నిందితులు దహన సంస్కారాలు చేశారు. ఆ మరుసటి రోజు.. ఈ హత్య కేసులోని నిందితుల్లో ఒకడైన హ్యాపీ ఖన్నా, అతని స్నేహితుడు రింకు.. సచిన్ చౌహాన్ అస్థికలను తీసుకుని యమునా నదిలో కలిపారు. అయితే.. నిందితుడు అంతా జాగ్రత్తగానే కవర్ చేసినప్పటికీ ఒక్కచోట దొరికిపోయారు.

    దహన సంస్కారాలు జరిపిన ఘాట్‌లో ఫోన్ నంబర్ అడగ్గా.. నిందితుల్లో ఒకరి బంధువుల ఫోన్ నంబర్‌ను అక్కడ చెప్పారు. హ్యాపీ ఖన్నా మరో స్నేహితుడు మనోజ్ భన్సాల్ పోలీసుల దృష్టి మరల్చేందుకు సచిన్ మొబైల్‌ను కాన్పూర్ తీసుకెళ్లాడు. అయితే.. అదే సమయంలో సచిన్ ఫోన్‌కు అతని తల్లి ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అనుమానం వస్తుందని భావించి.. కాల్ లిఫ్ట్ చేసిన మనోజ్ సచిన్ నిద్రపోతున్నాడని, నోయిడాలో ఉన్నామని చెప్పాడు. సచిన్ తల్లిదండ్రులకు అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సచిన్ హత్యకు గురయినట్లు తెలిసింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: