హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘థ్యాంక్యూ... మెట్రో’... వైరల్‌గా మారిన హైదరాబాద్ మహిళ ఫేస్‌బుక్ పోస్ట్...

‘థ్యాంక్యూ... మెట్రో’... వైరల్‌గా మారిన హైదరాబాద్ మహిళ ఫేస్‌బుక్ పోస్ట్...

హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

మెట్రోలో బ్యాగు మరిచిపోయిన మహిళ... నాలుగు గంటల్లో భద్రంగా తిరిగి అప్పగించిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది...

భాగ్యనగరానికి ఆభరణంలా నిలిచింది హైదరాబాద్ మెట్రో. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో... సూపర్ సక్సెస్ సాధించి రోజుకు లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్ర నేత కేటీఆర్ దాకా ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న హైదరాబాద్ మెట్రో...తాజాగా ఓ సాధారణ యువతి మెప్పుపొందడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే... జూబ్లీహిల్స్ ఏరియాకు చెందిన రోహిణీ రావు, ఎస్.ఆర్. నగర్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వెళ్లేందుకు మెట్రో ఎక్కింది. విదేశాల నుంచి వచ్చిన ఫ్రెండ్స్‌తో కలిసి ఎగ్జిబిషన్‌లో సరదాగా గడుపుదామని బయలు దేరింది. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది కానీ వచ్చేటప్పుడు మెట్రోలో తన బ్యాగు మరిచిపోయింది. వెంటనే విషయాన్ని మెట్రో స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి తెలియచేసింది.


ఆమె ఫిర్యాదుకు వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది... బ్యాగులో ఉన్న వస్తువుల వివరాలు అడిగి... దాన్ని తీసుకొచ్చి తిరిగి ఆమెకు అప్పగించారు. అసలు ఇండియాలో ఓ వస్తువు పోయిందంటే... మళ్లీ దొరకడం కష్టం. అదీ రైళ్లు, బస్సుల్లో అయితే ఇక దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. రోహిణి కూడా తన బ్యాగు పోయిందనే అనుకుంది. అయితే మెట్రో సిబ్బంది తిరిగి దాన్ని భద్రంగా అప్పగించడంతో వారిని ప్రశంసల్లో ముంచెత్తింది. తన బ్యాగులో రూ.12 వేల విలువైన పట్టు చీరలతో పాటు కొంత డబ్బు కూడా ఉందని తెలిపిందామె. బ్యాగు పోయిన నాలుగు గంటల్లోనే దాన్ని తిరిగి అందించిన.. మెట్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది రోహిణి.ఇవి కూడా చదవండి...


‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...


ఆదివారం పనిచేయాలని బలవంతం... హోటెల్‌కు రూ.150 కోట్ల జరిమానా...


సెల్ఫీ కావాలని దగ్గరకు వచ్చాడు... ఆ తర్వాత అసభ్యంగా తాకుతూ... కెనడా యువతికి...


ఆ సంబంధాన్ని నిలదీశాడని... భర్త మీద కిరోసిన్ పోసి... నిప్పు పెట్టిన భార్య...


16 ఏళ్ల బాలికపై 11 మంది గ్యాంగ్ రేప్ కేసు... ఆ 8 మంది ఎక్కడ...

First published:

Tags: Hyderabad Metro

ఉత్తమ కథలు