ట్రాన్స్‌జెండర్‌పై దారుణం.. కుటుంబానికి వింత వ్యాధి అంటూ...

పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అతడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. దీంతో అతడిని వెంటాడి పట్టుకున్నారు.

news18-telugu
Updated: May 22, 2019, 8:00 PM IST
ట్రాన్స్‌జెండర్‌పై దారుణం.. కుటుంబానికి వింత వ్యాధి అంటూ...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 8:00 PM IST
ట్రాన్స్ జెండర్ పదే పదే డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేశాడు. చనిపోయిన ట్రాన్స్‌జెండర్‌ను రేవా దేశాయ్‌గా గుర్తించారు. సుశీల్ భలే రావ్ అనే వ్యక్తిని ఓ ట్రాన్స్‌జెండర్ పదే పదే డబ్బుల కోసం వేధిస్తోంది. ఈ క్రమంలో తనకు డబ్బులు ఇవ్వకపోతే అతని కుటుంబం మొత్తం ఓ వ్యాధితో చనిపోతుందంటూ బెదిరిస్తోంది. ఈ క్రమంలో రేవా దేశాయ్‌తో సుశీల్ భలేరావ్‌కు గొడవ జరిగింది. ఇద్దరు కొట్టుకున్నారు. కోపంలో భలే రావ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత ఘటన స్థలం నుంచి పారిపోయాడు. రేవా దేశాయ్‌ని హత్య చేసిన తర్వాత భలేరావ్ అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నాడు. రాత్రి పూట అతడు పారిపోతుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అతడు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. దీంతో అతడిని వెంటాడి పట్టుకున్నారు. పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయాన్ని చెప్పేశాడు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...