Love Breakup: మాజీ ప్రేమికురాలు ఇచ్చిన గిఫ్ట్ మీ దగ్గర ఉందా..? అయితే రిటన్ ఇచ్చేయండి.. లేదంటే..?

బైక్ తగలబెట్టిన ప్రేమికురాలు

ప్రేమించాడని బాయ్ ఫ్రెండ్ కు 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బైక్ కొని ఇచ్చింది. కానీ చిన్న చిన్న కారణాలతో తరువాత ఇద్దరూ విడిపోయారు. దీంతో ఆమె ఏం చేసిందో తెలిసి అంతా షాక్ అయ్యారు.

 • Share this:
  ప్రేమ.. అసలు కవి కలానికి కూడా అందని ఓ అందమైన అనుభూతి.. నాకు నువ్వు.. నీకు నేను అని ఒకరికి ఒకరు తోడైన ఫీలింగ్.. ప్రేమలో ఉంటే అసలు టైమే తెలియదు కొందరికి.. రోజులు క్షణాల్లా గడిచిపోతాయి.. మనసు గాల్లో తేలుతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.. ఇలా ఎన్నో చెప్పలేని ఫిలింగ్స్.. అయితే అందరి ప్రేమలు విజయ తీరాలకు చేరుకోవు.. కొందరు తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించలేరు. మనస్పర్థలు, నమ్మకం లేకపోవడం, ఇతర కారణాలతో మధ్యలోనే విడిపోయే వారే 80 శాతమంది ఉన్నారు ఈ రోజుల్లో. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్‌ చెబితే.. సిల్లీ రీజన్స్‌తో విడిపోతుంటారు మరికొందరు. అచ్చం అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకుంది. ఆ సమయంలో కనాక్‌ వావన్‌ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు.

  తమ ప్రేమకు బ్రేకప్ అవ్వడంతో.. బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి కోరింది. అందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఓ ప్లాన్‌ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్‌ పార్క్‌ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

  తరువాత సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్‌ మీద పెట్రోల్‌ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్‌ వావన్‌ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్‌ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్‌ ధర ఒక మిలియన్‌ బాట్‌ అంట. అంటే మన కరెన్సీలో దాదాపు 23 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొని ఇచ్చిందని.. ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టానని ఆమె ఒప్పుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
  Published by:Nagesh Paina
  First published: