Thai Warship Sank : గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్ యుద్ధ నౌక ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. భారీ తుఫాన్ రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్(Gulf Of Thailand)లో హెచ్‌టీఎంఏఎస్ సుఖోటాయి(HTMS Sukhothai)నౌక మునిగినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 18,2022 రాత్రి థాయ్‌లాండ్ లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్ లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో హెచ్‌టీఎంస్ సుఖొథాయ్ నౌక గస్తీ నిర్వహిస్తున్న సమయంలో బలమైన ఈదురుగాలులు వీచి నౌక ఊగిపోవటంతో సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. దీంతో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింది. ఈ ఘటనపై సిబ్బంది థాయ్ నౌకాదళానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే షిప్‌లో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు మూడు నావల్ షిప్స్‌తో పాటు హెలికాప్టర్లను పంపారు. వారు అక్కడకు చేరుకుని మొబైల్ పంపింగ్ మిషన్లను నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించినా బలమైన తీవ్ర గాలులు వీయడంతో వారి యత్నాలు ఫలించలేదు. షిప్‌ను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్న క్రమంలో నీరు భారీగా నౌకలోకి చేరటంతో ఇంజిన్ వ్యవస్థ కూడా దెబ్బతిని పనిచేయకుండాపోయింది. విద్యుత్ లేకపోవటంతో సహాయం చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో నౌక నెమ్మదిగా ఓ వైపు ఒరుగుతూ నెమ్మది నెమ్మదిగా నీటమునిగింది.
Elon Musk: ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్ రాజీనామా? ఆన్‌లైన్ పోల్‌పై ఆధారపడిన కీలక నిర్ణయం..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Ship, Thailand