హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mass shooting : పిల్లల డే కేర్​ సెంటర్​ లో కాల్పులు..30మందికి పైగా మృతి

Mass shooting : పిల్లల డే కేర్​ సెంటర్​ లో కాల్పులు..30మందికి పైగా మృతి

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌ లోకి చొరబడిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

థాయ్​లాండ్(Thailand)​లో కొందరు సాయుధ దుండగులు రెచ్చిపోయారు. గురువారం ఉదయం నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని నొంగ్‌బువా లాంఫు పట్టణంలోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌ లోకి చొరబడిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌ణించిన‌వారిలో 23 చిన్నారులు,టీచర్లు,పోలీసు కూడా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కాగా,కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల‌కు తెగబడింది ఓ మాజీ పోలీసు ఆఫీస‌ర్ అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా,థాయిలాండ్‌లో సామూహిక కాల్పుల ఘ‌ట‌న‌లు చాలా అరుదు. 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విష‌యంలో కాల్పులు జ‌రిపగా 29 మంది మ‌ర‌ణించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Thailand

ఉత్తమ కథలు