వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు... 20 మంది మృతి

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్‌ ప్యాట్రిక్‌ తెలిపారు.

news18-telugu
Updated: August 4, 2019, 8:05 AM IST
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు... 20 మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. గత అర్ధరాత్రి అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్‌ ప్యాట్రిక్‌ తెలిపారు.దుండగులు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడినట్టు ఎల్‌పాసో మేయర్ డీ మార్గో పేర్కొన్నారు. ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఏం జరుగుతోందో తెలియక స్టోర్‌లోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గతవారం అమెరికాలోని కాలిఫోర్నియాలోని గార్లిక్ ఫెస్టివల్‌లో కూడా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు