అమెరికా టెక్సాస్‌లో కాల్పులు... ఐదుగురు మృతి

మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

news18-telugu
Updated: September 1, 2019, 7:59 AM IST
అమెరికా టెక్సాస్‌లో కాల్పులు... ఐదుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో వణికింది. టెక్సాస్‌లోదుండగుడు కాల్పలకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని దుండగుడ్ని అంతమొందించారు.  కాల్పులకు పాల్పడిన వ్యక్తి ముందుగా బైక్‌పై వచ్చాడు. అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక ట్రక్కును హైజాక్ చేశాడు. అందులో వెళ్లి అక్కడున్న జనాలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. టెక్సాస్‌కు చెందిన ఓడెసా, మిడ్‌ల్యాండ్ పట్టణాల సమీపంలో వాహనాన్ని నడిపాడు.

ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వారు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తూ, ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాత అతనినిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. కాగా ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు న్యాయశాఖాధికారులు కూడా గాయపడ్డారు. మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

 
First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు