TERRORISTS ATTACK BUS CARRYING CISF PERSONNEL 1 DIED 2 INJURED
Attack On Jawans Bus : కశ్మీర్ లో మరో పుల్వామా తరహా దాడి..జవాన్ల బస్సుపై ఉగ్రదాడి
సీఐఎస్ఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రదాడి
Attack On Jawans Bus : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు పుల్వామా తరహా దాడి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో జమ్మూకశ్మీర్లోని చద్ధా క్యాంపు సమీపంలోసీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా
Attack On Jawans Bus : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు పుల్వామా(Pulwama Attack) తరహా దాడి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని చద్ధా క్యాంపు సమీపంలోసీఐఎస్ఎఫ్(CISF) బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాదులు తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దాడి సమయంలో బస్సులో 15మంది జవాన్లు(CISF Jawans) ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు(Terrorists Killed).
ఉగ్రదాడిని బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టగా వారి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు సమీపంలోని సుంజ్వాన్ ప్రాంతానికి జారుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది ఈ క్రమంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా వారిపైనా ముష్కరులు ఎదురుకాల్పులు జరిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు జమ్ము అడిషనల్ డీజీపీ ముకేశ్సింగ్ తెలిపారు. సైనికులు సహా గాయపడిన పోలీసులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ జమ్ము పర్యటన నేపథ్యంలో ఉగ్రవాద కదలికలు ఉన్నాయనే సమాచారం మేరకు సుంజ్వాన్ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. బలగాలపైకి గ్రనేడ్లు విసిరిశారు. సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఇంటర్నేట్ సేవలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, జమ్ముకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. గురువారం జమ్ముకశ్మీర్ బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.