కూలీలపై ఉగ్రదాడి.. జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు అయి ఉంటారని భావిస్తున్నారు.

news18-telugu
Updated: October 30, 2019, 11:39 AM IST
కూలీలపై ఉగ్రదాడి.. జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో కూలీల మీద కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమికంగా తెలిసింది. జమ్మూకాశ్మీర్ పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. కుల్గాంలో ఉగ్రదాడి జరిపిన ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను కూడా రప్పిస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు అయి ఉంటారని భావిస్తున్నారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

చనిపోయిన వారి వివరాలు..

ముస్లిం షేక్

ఖమర్ దిన్ షేక్


రఫీక్ షేక్
నయీమ్ ఉద్ షేక్
రఫీక్ ఉల్జహూరుద్దీన్ (గాయపడిన వ్యక్తి)

నిన్న జమ్మూకాశ్మీర్‌లోని సోపోర్‌లో బస్టాండ్ మీద ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 17 మంది పౌరులు గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కొన్నాళ్లు ఉగ్రదాడులు ఎక్కడా నమోదు కాలేదు. ఇప్పుడు మళ్లీ టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం పర్యటిస్తున్న రోజే ఉగ్రవాదులు కూలీలపై కాల్పులు జరిపారు.First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>