Jammu Kashmir Attack : జమ్మూకాశ్మీర్ లో గ్రెనేడ్ దాడి : ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు

news18-telugu
Updated: March 21, 2019, 11:49 AM IST
Jammu Kashmir Attack : జమ్మూకాశ్మీర్ లో గ్రెనేడ్ దాడి : ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 21, 2019, 11:49 AM IST
జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో తీవ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. బారాముల్లాలలో ని సోపోర్ గ్రామంలో మెయిన్ చౌక్ వద్ద పోలీసు ఔట్ పోస్ట్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు మరో పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇదిలా ఉంటే పుల్వామా దాడి అనంతరం లోయలో ఏర్పడ్డ కల్లోల పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు చర్యలు తీసుకుంటున్నాయి.

First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...