Home /News /crime /

TERROR ATTACK HAPPEND IN KASHMIR GOLDSMITH SHOT DEAD CRPF OFFICER INJURED SRD

Terror Attack : శ్రీనగర్ లో కొత్త ఏడాది తొలి రోజే రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Terror Attack : కొత్త ఏడాది తొలి రోజే శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని స్థానిక మార్కెట్ లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

    కొత్త ఏడాది తొలి రోజే శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని స్థానిక మార్కెట్ లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్పాల్ సింగ్ ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వ్యాపారిపై ఉగ్రదాడి జరగడంతో.. స్థానిక వ్యాపారుల్లో భయాందోళనలు మొదలయ్యాయ్. ఎలాగైనా తమకి భద్రతా కల్పించాలని బలగాల్ని కోరుతున్నారు స్థానిక వ్యాపారులు.మరో టెర్రర్ ఎటాక్ లో CRPF అధికారికి తీవ్రగాయాలయ్యాయ్. ఈ ఘటన అనంత్ నాగ్ లోని సంగం ఏరియాలో చోటు చేసుకుంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    ఇదిలా ఉంటే..ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి లోకమంతా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురు చూస్తోంటే.. బులంద్‌షహర్ జిల్లాలోని 10 వ తరగతి చదువుతున్న ఒక మైనర్‌ విద్యార్థి మాత్రం తన సహచరుడిపై పగతో రగిలిపోయాడు. క్లాస్‌ రూంలో జరిగిన చిన్న తగాదాకే పథకం ప్రకారం తన క్లాస్‌మేట్‌ను కాల్చి చంపాడు. ఏకంగా ఆ బాలుడుపై మూడు సార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

    ఇద్దరూ మైనర్‌ బాలురు కావడం, నిందితుడు తరగతి గదిలో ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడటం ఆందోళన రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాలురు 14 సంవత్సరాల వయస్సున్నవారే. కేవలం సీటుకోసం నిన్న ఇద్దరూ తగాదా పడ్డారు. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు తన మామయ్య తుపాకీని పాఠశాలకు తీసుకెళ్లి మరీ గురువారం ఉదయం బాధిత విద్యార్థిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Kashmir, Srinagar, Terror attack, Terrorists

    తదుపరి వార్తలు