హోమ్ /వార్తలు /క్రైమ్ /

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాక్టర్ ను ఢీకొట్టిన గరుడ బస్సు..ముగ్గురు మృతి..15 మందికి గాయాలు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రాక్టర్ ను ఢీకొట్టిన గరుడ బస్సు..ముగ్గురు మృతి..15 మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండల జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్, బస్సు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Wanaparthy

తెలంగాణ (Telangana) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి (Wanaparthy) జిల్లా కొత్తకోట మండల జాతీయ రహదారిపై (National Highway) ట్రాక్టర్ ను ఆర్టీసీ గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది. బస్సు డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్, బస్సు పూర్తిగా దెబ్బతిన్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు..సిట్ ముందుకు బండి సంజయ్ అనుచరుడు..ఆ ముగ్గురి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ!

చెరుకు లోడ్ తో ట్రాక్టర్..ప్రయాణికులతో బస్సు

కాగా చెరుకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు హైదరాబాద్ (Hyderabad) నుండి బెంగళూరు (Bengalore) వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకోట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సు, ట్రాక్టర్ దెబ్బతిన్న దానిని బట్టి చూస్తే ప్రమాద తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. రెండు వాహనాలు కూడా అధిక వేగంతోనే వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

కాగా ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Bus accident, Mahabubnagar, Road accident, Telangana

ఉత్తమ కథలు