హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tenth Students sad story: తెల్లవారితే పదో తరగతి పరీక్ష.. రాత్రి అమ్మ ఆత్మహత్య.. విద్యార్థితో విధి ఆడిన వింత నాటకం..

Tenth Students sad story: తెల్లవారితే పదో తరగతి పరీక్ష.. రాత్రి అమ్మ ఆత్మహత్య.. విద్యార్థితో విధి ఆడిన వింత నాటకం..

రాహుల్, తల్లి (ఫైల్​)

రాహుల్, తల్లి (ఫైల్​)

విధి ఆడిన వింత నాటకంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ విద్యార్థిది. ఒక వైపు ఎస్​ఎస్​సీ ఎగ్జామ్స్ మరో వైపు కన్న తల్లి మృతి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

(Srinivas. P, News 18, Karimnagar)

విధి ఆడిన వింత నాటకం (strange play played by fate)లో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ విద్యార్థిది. ఒక వైపు ఎస్​ఎస్​సీ ఎగ్జామ్స్ మరో వైపు కన్న తల్లి మృతి(Mother died). ఆర్థిక ఇబ్బందులతో అమ్మ ఆత్మహత్య  (Mother suicide)చేసుకున్నట్లు తెలిసింది. కంటిధారను దిగమిగుకుంటూ పరీక్షా కేంద్రం వైపు అడుగులు వేశాడు బాలుడు. చివరకు ఎగ్జామ్స్ (Exams) రాశాడు.  కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థి వంగ రాహుల్ దీన కథ ఇది (Tenth Students sad story)..

పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్  (Karimnagar)  జిల్లా చిగురుమామి డికి చెందిన వంగ శ్రీలత (35 ) అప్పుల బాధ తట్టుకోలేక గత మంగళవారం మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగింది . కుటుంబ సభ్యులు 108 లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి (Government Hospital) తరలించగా , చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతిచెందింది . శ్రీలతకు రూ .3 లక్షల వరకు అప్పులున్నాయి . భర్త శ్రీనివాస్ (Srinivas) వృత్తిరీత్యా మోటార్ మెకానిక్ . సరైన గిరాకీ లేక , కుటుంబ అవసరాలకు చేసిన అప్పులు (Debt) తీరే మార్గంలేక శ్రీలత ఆత్మహత్య (Srilatha suicide)కు పాల్పడింది .

మృతురాలికి ఇద్దరు కుమారులు (Two sons) ఉన్నారు . పెద్ద కొడుకు రాహుల్ (Rahul) చిగురుమామిడిలోని ఓ పాఠశాలలో పదో తరగతి (Tenth class), చిన్నకొడుకు కూడా అదే స్కూల్లో 4 వ తరగతి చదువుతున్నారు . రాహుల్​ను బంధువులు ఓదార్చి చివరకు ఎగ్జామ్స్ (Tenth exams) సెంటర్ కు తీసుకెళ్లి పరీక్ష రాయించారు. ఈ సంఘటన మండలకేంద్రంలో పలువురిని కంట తడి పెట్టించింది.

పరీక్ష రాసి వచ్చేసరికి..

ఇలానే మొన్నకూడా ఇంటర్ మీడియట్ (Intermediate exams) పరీక్షలో పెద్దపల్లి జిల్లా (peddapalli), రామగుండం, చెందిన రాణి అనే అమ్మాయిని తల్లి తండ్రులు బైక్ పై ఎగ్జామ్స్ సెంటర్ కు దింపడానికి వెళ్తున్న సమయంలో వెనుకాల నుంచి కార్ ఢీకొట్టడంతో (Accident) రాణి, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరువురిని  ఆస్పత్రిలో చేర్పించారు. రాణికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ ఎగ్జామ్ టైం అవడంతో తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూడా .. బాధను దిగమింగుకుంటూ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చే లోపు.. తండ్రి మరణించాడు. తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటం పలువురిని కంట తడి పెట్టించినది.

First published:

Tags: 10th Class Exams, Karimangar, Tenth class, Woman suicide

ఉత్తమ కథలు