TENSION IN THE AREA OVER THE INCIDENT WHERE A WIFE WAS BEATEN TO DEATH BY HER SECOND HUSBAND NEAR NAGERCOIL IN KANYAKUMARI DISTRICT SSR
Second Marriage: రెండో పెళ్లితో అయినా సుఖం, సంతోషం దక్కుతాయనుకుంటే పాపం.. చివరకు ఇలా జరిగింది..
విజయ్‌కుమార్, సుజ (పెళ్లి ఫొటో)
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. రెండో భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలోని రాజక్కమంగళంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సుజ(45), విజయకుమార్(45) భార్యాభర్తలు.
కన్యాకుమారి: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. రెండో భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలోని రాజక్కమంగళంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సుజ(45), విజయకుమార్(45) భార్యాభర్తలు. సుజ విజయకుమార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. మొదట పెళ్లి చేసుకున్న వ్యక్తి సుజను వేధింపులకు గురిచేసేవాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్ర హింసలకు గురిచేయడంతో సుజ విసిగిపోయింది. ఆ సమయంలో ఇక అతనితో కలిసి ఉండటం కష్టమని భావించిన సుజ మొదటి భర్తతో తెగతెంపులు చేసుకుంది. అతనితో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. విజయ్‌కుమార్‌కు కూడా భార్య లేదు.
ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ఇద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లు బాగానే ఉన్నారు. మొదటి భర్త కారణంగా పెళ్లిపై వైరాగ్యంతో ఉన్న సుజ రెండో భర్త సంతోషంగా చూసుకుంటూ ఉండటంతో తనకు ఉపశమనం లభించినట్టుగా అనిపించింది. కానీ కొన్నాళ్లకే ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
రెండో పెళ్లితో కొత్త ఆశలు చిగురించిన ఆమె జీవితంలో మళ్లీ చీకటి రోజులు నీలి మేఘాల్లా కమ్ముకున్నాయి. విజయ్ కుమార్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. రోజురోజుకూ ఆమెను తాగొచ్చి హింసించడం మొదలుపెట్టాడు. ఆమె మొదటి భర్త కంటే దారుణంగా సుజను చిత్రహింసలకు గురిచేశాడు.
గత నెల 23న కూడా విజయ్ కుమార్ ఇంటికి తాగొచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మద్యం మత్తులో ఉన్న విజయ్‌కుమార్ క్షణికావేశంలో భార్య సుజపై దాడి చేశాడు. ఈ ఘటనలో సుజ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది. రక్తపుమడుగులో స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తుండగా సుజ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఆమె అన్నయ్య జస్టిన్ పాల్ ఫిర్యాదుతో విజయ్‌కుమార్‌పై రాజక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండో పెళ్లి చేసుకుని భార్యను మంచిగా చూసుకోవాల్సిందిపోయి మద్యానికి బానిసై ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. జీవితానికి ఒక తోడు కోరుకుంటూ రెండో పెళ్లి చేసుకోవాలని భావించడం తప్పు కాదు గానీ ఆ చేసుకోబోయే వ్యక్తి గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాకే పెళ్లికి సిద్ధపడాలని పోలీసులు సూచిస్తున్నారు. మొదటి భర్త కారణంగా దూరమైన సంతోషం రెండో పెళ్లితో అయినా దక్కుతుందని భావించిన సుజ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయంది. సుజ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం Asaripallam Hospitalకి పోలీసులు తరలించారు. ఆమెను హత్య చేసింది తానేనని విజయ్‌కుమార్ అంగీకరించాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.