Home /News /crime /

TENSION IN ADILABAD DISTRICT OVER FATHER SON SUICIDE ATTEMPT IN LAND DISPUTE SNR ADB

Land Mafia: ఆదిలాబాద్‌ జిల్లాలో టెన్షన్‌ .. భూకబ్జాకోరుల దాడితో తండ్రి,కొడుకు ఆత్మహత్యాయత్నం

(భూకబ్జాకోరుల దాడి)

(భూకబ్జాకోరుల దాడి)

Land Mafia: తెలంగాణలో భూమాఫియా ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లు అసలు యజమానులపై దాడులకు తెగబడటంతో వేరే గత్యంతరం లేక తండ్రికొడుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇంకా చదవండి ...
    (K.Lenin,News18,Adilabad)
    తెలంగాణలో చాలా చోట్ల భూకబ్జాదారులు రాజ్యమేలుతున్నారు. అర్దబలం చూసుకొని కొందరు, అంగబలంతో మరికొందరు, రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఇంకొందరు అమాయకుల భూములు, ఇళ్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో కూడా ఇదే తరహాలో కొందరు భూకబ్జాదారులు రైతుకు చెందిన భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. భూమాఫియా ఆగడాలు తట్టుకోలేకపోయిన తండ్రి, కొడుకు(Father), (son) ఆత్మహత్యాయత్నం(Suicide attempt)చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత(Tension)కు దారి తీసింది. జిల్లాలోని తలమడుగు(Talamadugu) మండలం కజ్జర్ల (Kajjarla)గ్రామానికి చెందిన యాళ్ల జైపాల్‌రెడ్డి(Yalla Jaipal Reddy)అతని కుమారుడు చరణ్‌రెడ్డి (Charan Reddy)చేనులో పనిచేస్తుండగా ఆసిఫ్ అనే వ్యక్తి  ఈ భూమి తనదేనంటూ 20 మందితో వచ్చి  దాడి చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

    అడవుల జిల్లాలో భూదోపిడీ..
    దీంతో బాధితులు తండ్రి, కొడుకు ఇద్దరూ తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పక్కనే పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు గమనించి వెంటనే జైపాల్‌రెడ్డి, చరణ్‌రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

    రైతులపైనే దాడి..
    పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఇద్దరిలో తండ్రి జైపాల్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు జైపాల్‌రెడ్డి బంధువులు పెద్ద ఎత్తున రిమ్స్ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై భైటాయించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు కదిలేదిలేదంటూ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని వాహనాల్ని దారి మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

    తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం..
    భూమాఫియా ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న జైపాల్‌రెడ్డి, చరణ్‌రెడ్డికి అండగా నిలుస్తూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఆదిలాబాద్ మండలం మావలకి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆఫీజ్ ఖాన్ అనే వ్యక్తి తమకు సంబంధించిన 8ఎకరాల భూమిని కబ్జా చేసుకొని పెన్సింగ్ ఏర్పాటు చేశాడని అదే విషయాన్ని ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఫలితం లేదంటున్నారు జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు.

    బాధితుల పక్షాన నిలబడ్డ స్థానికులు..
    రెవెన్యూ అధికారుల అండ దండలతోనే కబ్జాదారులు కిరాయి మనుషులను తీసుకొచ్చి తండ్రి, కొడుకుపై దాడి చేయించారని విమర్శించారు. కబ్జాదారుల దాడులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు బాధితుల బంధువులు. కబ్జా చేయాలని చూస్తున్న భూమిని గత 36సంవత్సరాలుగా జైపాల్‌రెడ్డి కుటుంబం సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి  దాడి చేసినట్లుగా చెబుతున్నారు. రౌడీయిజం చేస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులంతా సంఘటితమై బాధిత రైతు కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ నటరాజన్ బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. 48 గంటల్లో విచారణ జరిపి న్యాయం చేస్టామని హామీ ఇచ్చారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, Land kabja issue, Suicide attempt

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు