హోమ్ /వార్తలు /క్రైమ్ /

మెదక్ జిల్లాలో దూడను చంపిన పులి... స్థానికుల్లో భయాందోళనలు

మెదక్ జిల్లాలో దూడను చంపిన పులి... స్థానికుల్లో భయాందోళనలు

పులి చంపిన లేగదూడ

పులి చంపిన లేగదూడ

Telangana : తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య పులుల కలకలం ఎక్కువవుతోంది. అడవుల్లోంచీ చుట్టుపక్కల గ్రామాల్లోకి వచ్చేస్తున్న పులులు... తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.

  మెదక్ జిల్లాలోని రామాయం పేట మండలం... లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోజూ లాగే రైతు దాసరి పెద్ద ఎల్లయ్య పొలం పనులకు వెళ్లాడు. దూడకు గడ్డి వేద్దామని చూస్తే... అది చనిపోయి కనిపించింది. ఏదో జంతువు దాన్ని తినేసినట్లు కనిపించడంతో షాకయ్యాడు. దగ్గరకు వెళ్లి చూస్తే దూడ చుట్టూ పులి పంజా ముద్రలు కనిపించాయి. ఆయనకు చెమటలు పట్టాయి. ఒక్కసారిగా చుట్టూ చూశాడు. అక్కడెక్కడా పులి ఉన్నట్లు కనిపించలేదు. వెంటనే అటుగా పొలం పనులకు వెళ్తున్న వాళ్లను పిలిచి... విషయం చెప్పాడు. వాళ్లు కూడా కంగారు పడ్డారు. చివరకు అందరికీ విషయం అర్థమైంది. ఊళ్లోకి పులి వచ్చింది. పైగా అది దూడను తినేసిందంటే... చాలా ఆకలి మీద ఉందనీ, ఒకసారి వచ్చిన పులి మళ్లీ మళ్లీ వస్తుందని అనుకున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని పొలం గట్ల వైపు రాకుండా చూసుకోవాలని అందరూ చెప్పుకున్నారు. ఇలా పులి రాక... లక్ష్మీపూర్ గ్రామస్థులను తీవ్ర భయాందోళనల్లో పడేసింది.


  ఇదివరకు ఎప్పుడూ పులి అటువైపు రాలేదు. ఐతే... రామాయం పేట మండలంలో కొంతవరకూ అడవి ఉంది. అక్కడ పులి తిరుగుతున్నట్లు ఇప్పటివరకూ ఆనవాళ్లు లేవు. ఇప్పుడు లక్ష్మీపూర్‌లో జరిగిన ఘటనతో పులి ఒకటి సంచరిస్తోందని అర్థమైంది. ఈ విషయాన్ని అటవీ అధికారులకు చేరవేసిన స్థానికులు... వీలైనంత త్వరగా ఆ పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.


  అందరూ జాగ్రత్తగా ఉంటూ... పులి ఎవరికి కనిపించినా... అందరూ కలిసి దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు. రాన్రానూ అడవులు తగ్గిపోతుండటం, ఉన్న కాస్త అడవుల్లో సరైన ఆహారం దొరక్కపోవడంతో... పులులు, క్రూర మృగాలూ... గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

  PICS: అసదుద్దీన్ కుమార్తె నిఖా.. ముబారక్ తెలిపిన ప్రముఖులు


  First published:

  Tags: Telangana News, Tiger Attack

  ఉత్తమ కథలు