అగ్రకులం అమ్మాయితో సంబంధం ఉందని దళిత విద్యార్థిపై దాష్టీకం.. రాజకీయ దుమారం

గోరాడ్ గ్రామానికి తీసుకెళ్లిన యువకులు అతడిని ఓ వేపచెట్టుకు కట్టేసి చావగొట్టినట్టు ఆరోపించాడు. తనకు ఇంగ్లీష్ పరీక్ష ఉందని, తనను వెళ్లనివ్వాలని వేడుకున్నా తన గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

news18-telugu
Updated: March 22, 2019, 4:43 PM IST
అగ్రకులం అమ్మాయితో సంబంధం ఉందని దళిత విద్యార్థిపై దాష్టీకం.. రాజకీయ దుమారం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 22, 2019, 4:43 PM IST
లోక్‌సభ ఎన్నికల వేళ గుజరాత్‌లో మరోసారి కుల వివాదం మొదలైంది. ఉత్తర గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలో అగ్రకులానికి చెందిన బాలికతో సంబంధం ఉందన్న అనుమానంతో ఓ 17 ఏళ్ల దళిత యువకుడిని చావబాదారు. అతడిని పరీక్ష కేంద్రం వద్ద నుంచి తీసుకుని వెళ్లి మరీ చావగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో కుల వివాదం రాజుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మెత్తం మెహసానా పట్టణం మొత్తం మూసేస్తామని వాద్గాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ హెచ్చరించారు. మరోవైపు నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని దళితులు ఆందోళనలు చేస్తున్నారు. ‘నేను ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లా. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బస్సులో ధినోజ్ గ్రామంలో ఉన్న సార్వజనిక్ విద్యా మందిర్ హైస్కూల్‌ దగ్గరికి వెళ్లా. ఎగ్జామ్ సెంటర్ బయట నేను వెయిట్ చేస్తున్నప్పుడు రమేష్ పటేల్ అనే వ్యక్తి వచ్చాడు. అతడికి, నాకు ముఖపరిచయం మాత్రమే ఉంది. కొంచెం పని ఉంది అని చెప్పి నన్ను ఒక్కడినే అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మరో వ్యక్తితో కలసి నన్ను బైక్ మీద కొంచెం దూరంలో ఉన్న గోరాడ్ విలేజ్‌కి తీసుకెళ్లారు.’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు.

గోరాడ్ గ్రామానికి తీసుకెళ్లిన యువకులు అతడిని ఓ వేపచెట్టుకు కట్టేసి చావగొట్టినట్టు ఆరోపించాడు. తనకు ఇంగ్లీష్ పరీక్ష ఉందని, తనను వెళ్లనివ్వాలని వేడుకున్నా తన గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చదువు మానేయాలని, వేరే పని చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితుడు తెలిపాడు. మొత్తానికి అతడు పరీక్ష రాయలేకపోయాడు. అయితే, ఈ విషయం బాధితుడు ఇంట్లో చెప్పలేదు. కానీ, కుమారుడు స్నానం చేస్తున్న సమయంలో ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దళిత సంఘాల నేతలు బాధితుడిని పరామర్శించారు. ‘రెండు రోజుల క్రితం బాధితుడి ఇంటికి వెళ్లాం. అగ్రకులానికి చెందిన అమ్మాయితో సంబంధం ఉందన్న అనుమానంతో అతడిని చావబాదారు.’ అని దళిత హక్కులపై పోరాడుతున్న సుబోధ్ కుముంద్ న్యూస్‌18కి తెలిపారు.

ఈ ఘటనతో గుజరాత్‌లో దళితులు ఆందోళన చేస్తున్నారు. దళిత నాయకుడు, స్వతంత్ర ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మెవానీ ఈ ఘటనను ఉద్దేశించి ‘ఈసారి దళితుడి రక్తంతో వారు (బీజేపీ) హోలీ ఆడుకున్నారు. అతడు నడవలేకపోతున్నాడు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నాడు.’ అని అన్నారు. ఈ ఘటనలో నిందితులను 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. బీజేపీ నేతలకు ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహాలకు కనీసం పూలదండలు కూడా వేయనివ్వబోమని హెచ్చరించారు.

First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...