హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్-హన్సి మార్గంలో మంగళవారం రాత్రి 10.30గంటలకు ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు.
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్-హన్సి మార్గంలో మంగళవారం రాత్రి 10.30గంటలకు ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ఒకే గ్రామానికి చెందినవారుగా డిప్యూటీ ఎస్పీ తెలిపారు.గాయపడ్డ వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ను విచారిస్తున్నట్టు చెప్పారు.అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.