లంచం కింద 10 ఎకరాలు భూమి.. అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతిలో కొత్త కోణం

లాక్‌డౌన్ వల్ల తమ దగ్గర డబ్బులు లేవని బాధితులు చెప్పడంతో.. డబ్బుల కింద పది బ్లాంక్ చెక్స్ తీసుకున్నాడు నగేశ్.

news18-telugu
Updated: September 10, 2020, 11:09 AM IST
లంచం కింద 10 ఎకరాలు భూమి.. అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతిలో కొత్త కోణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
112 ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో కోటి 12 లక్షలు లంచం తీసుకున్న మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్.. లంచం డబ్బుల కింద 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. భూమి రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వనని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎకరం రూ. 15 లక్షలు విలువైన భూమిని ఇవ్వలేమని బాధితులు తెలిపారు. ఏ అధికారి లంచం కింద భూములు తీసుకోడదని నగేశ్ చెప్పాడు. తన బినామీ జీవన్ గౌడ్ పేరిట 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. రూ. 40 లక్షలు, పది ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఎన్‌వోసీ ఇస్తానని నగేశ్ తెలిపాడు.

లాక్‌డౌన్ వల్ల తమ దగ్గర డబ్బులు లేవని బాధితులు చెప్పడంతో.. డబ్బుల కింద పది బ్లాంక్ చెక్స్ తీసుకున్నాడు నగేశ్. ఇక నగేశ్ ఇంట్లో ఏసీసీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. 12 ఏసీబీ బృందాలు పలువురు తహసీల్దార్లు, ఎమ్మార్వోల నివాసాలతో పాటు నగేశ్ బినామీల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల విచారణలో మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు తేలినట్టు తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 10, 2020, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading