TEMPTED BY FREE THALIS MAN LOSES 1L IN CREDIT CARD FRAUD GH VB
Food Order: అతడికి 74 ఏళ్లు.. ఆకలి వేస్తుండటంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు.. ముగింపు ఊహించలేక పోయాడు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను విపరీతంగా వాడేస్తున్నారు. దీన్ని అదునుగా భావించి సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) నయా మోసాలకు తెరలేపుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటూ అమాయకులకు ఆశ చూపి.. ఆస్తినంతా లాగేస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ (Digital) యుగంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను (Internet) విపరీతంగా వాడేస్తున్నారు. దీన్ని అదునుగా భావించి సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) నయా మోసాలకు తెరలేపుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలను ఎంచుకుంటూ అమాయకులకు ఆశ చూపి.. ఆస్తినంతా లాగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.100 థాలీ (భోజనం - thali) కొంటే 2 థాలీలు ఉచితంగా ఇస్తామని ముంబైకి చెందిన ఓ వృద్ధుడిని బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. ఈ వ్యక్తికి టోకరా వేసి ఏకంగా దాదాపు రూ.లక్ష కాజేశారు. దీంతో కంగుతిన్న సదరు వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం మోసగాళ్లను పట్టుకునేందుకు ముంబై పోలీసులు(Mumbai Police) ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని ముంబై నగరంలోని ఖార్ (Khar) ప్రాంతానికి చెందిన ఎన్డీ నంద్ అనే ఓ 74 ఏళ్ల వృద్ధుడు జనవరి 19న ఫేస్బుక్లో పోస్టులు చూస్తూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలో అతడికి ఒక అదిరిపోయే అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. 100 రూపాయలకే ఓ థాలీతోపాటు రెండు థాలీలను ఉచితంగా అందజేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. 100 రూపాయలకే ఇంటిల్లపాది మూడు పూటలా తినేసేంత ఆహారం లభిస్తుంది కదా అని సదరు వృద్ధుడు టెంప్ట్ అయ్యాడు. వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా ఆ యాడ్‌లో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు.
అవతలివైపు నుంచి “నేను దీపక్‌ని మాట్లాడుతున్నాను. ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీ క్రెడిట్ కార్డ్ వివరాలను చెప్పండి. మొదట్లో రూ.10 ఛార్జ్ చేస్తాం. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత రూ.90 నగదు రూపంలో చెల్లించండి" అని ఒక గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. ముందుగా రూ.10యే చెల్లించమంటున్నారని... అందుకే ఇందులో ఎలాంటి మోసం లేదని నంద్ బలంగా నమ్మాడు. ఆ తర్వాత ఆర్డర్‌ను కంప్లీట్ చేసేందుకు మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయమని గుర్తు తెలియని వ్యక్తి నంద్ ని కోరాడు. అతడిని నమ్మిన నంద్ ఏ మాత్రం సందేహించకుండా వెంటనే ఓటీపీ చెప్పాడు. అంతే మరుక్షణంలోనే అతడి ఫోన్‌కు చకచకా 2 ఎస్ఎంఎస్లు వచ్చాయి. అందులో తన క్రెడిట్ కార్డ్ నుంచి ఒకసారి రూ.49,760.. రెండోసారి రూ.49,760 నగదు డిడక్ట్ అయినట్లు కనిపించింది.
అలా నంద్ ఓ బూటకపు ప్రకటనకు బలై తన క్రెడిట్ కార్డ్‌లోని రూ.99,520 కోల్పోయాడు. ఈ మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన రెండు ఎస్ఎంఎస్లు చూసి తాను నిలువునా మోసపోయానని ఎట్టకేలకు సదరు బాధితుడు గ్రహించాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. "డబ్బు జమ అయిన ఖాతా సమాచారాన్ని సేకరించడానికి మేం బ్యాంకు నుంచి వివరాలను కోరాం" అని ఖర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక అధికారి తెలిపారు.
మోసగాడిని ట్రాక్ చేసేందుకు ఖార్ పోలీసులు కాల్ డేటా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. విశ్వసనీయ వెబ్‌సైట్స్ ద్వారా మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేయాలని సలహా ఇస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు షేర్ చేయకూడని హెచ్చరిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.