అగ్రరాజ్యమైన అమెరికాలోని వైట్ హౌస్(White House)పై దాడికి ప్రయత్నించిన ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్ హౌస్‌ని బ్లాక్ చేసేందుకు పెట్టిన ట్రాఫిక్ బారియర్స్(Traffic barriers)ని ఓ భారీ ట్రక్కుతో ఢీకొట్టి ధ్వంసం చేసాడో యువకుడు. లోపలికి వెళ్లాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో పోలీసులు కటకటాలవెనక్కి పంపారు. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనంపైనే దాడికి ప్రయత్నించిన యువకుడు తెలుగువాడిగా గుర్తించారు. అతని పేరు సాయివర్షిత్(Saivarshit)గా తెలుస్తోంది. యువకుడు వైట్ హౌస్‌పై దాడి చేసేందుకు తెచ్చుకున్న వాహనంపై నాజీ జెండా(Nazi flag)ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రెసిడెంట్‌పైనే దాడికి కుట్ర..
అమెరికా అధ్యక్షుడిపై దాడి చేయాలని కుట్రభగ్నమైంది. వైట్‌హౌస్ దగ్గర కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు భారీ ట్రక్‌తో రాత్రి సమయంలో బీభత్సం సృష్టించాడు. శ్వేతసౌధంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వైట్‌హౌస్ బంగ్లాకు ఉత్తరభాగం వైపు నుంచి ట్రక్‌తో దూసుకొచ్చాడు. అక్కడ ట్రాఫిక్ బారియర్స్‌ని ఢీకొట్టాడు. యువకుడు తెచ్చిన వాహనంపై నాజీ జెండా ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే సాయివర్షిత్‌ని అదుపులోకి తీసుకున్నారు. సాయివర్షిత్ 2022లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. జో బైడెన్‌పై హత్యకు గత ఆరు నెలలుగా కుట్ర పన్నినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు కుట్ర కేసులో ఇరుక్కున్న తెలుగు యువకుడు అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు కుట్ర చేసింది తెలుగు యువకుడు సాయివర్షిత్ అంటున్న పోలీసులు అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్న సాయి వర్షిత్. అక్కడి నుంచి వాషింగ్‌టన్ డీసీకి వచ్చిన సాయి వర్షిత్.… pic.twitter.com/Ya6wEV2Xu0
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2023
వైట్‌హౌస్‌లో ట్రక్‌తో బీభత్సం..
వైట్‌హౌస్ దగ్గర ట్రక్‌తో దాడికి ప్రయత్నించిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను టార్గెట్‌గా చేసుకొని తాను దాడికి పాల్పడినట్లుగా వెల్లడించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం సాయివర్షిత్‌పై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్యంగా వాహనాన్ని డ్రైవ్ చేయడంతో పాటు అమెరికా అధ్యక్షుడి ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించినట్లుగా కేసులు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసును నమోదు చేశారు.
తెలుగు యువకుడి తెగింపు..
పట్టుమని 20సంవత్సరాలు లేని ఓ యువకుడు దేశ అధ్యక్షుడ్ని లక్ష్యంగా చేసుకొని అగ్రరాజ్యంలో దాడికి ప్రయత్నించిన వైరల్ అవుతోంది. దాడి చేస్తున్న వీడియో, నిందితుడి ఫోటో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సాయివర్షిత్ దాడికి పాల్పడిన విషయాన్ని బైడెన్ దృష్టికి తీసుకెళ్లారు అమెరికా పోలీసులు. ఈమొత్తం ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసులు, వైట్ హౌస్ సెక్యురిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
కూపీ లాగుతున్న పోలీసులు..
చెస్ట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయివర్షిత్ గతేడాది మార్క్వెట్ సీనియర్ హైస్కూల్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నిందితుడి వివరాలు, మరింత సమాచారం కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇంత పెద్ద నేరానికి పాల్పడటానికి అతనికి ఎెవరు సహాకరిస్తున్నారు..ఎెవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నారు. అయితే అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటూ తాజాగా వాషింగ్‌టన్ డీసీకి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.