నటి సోనాక్షికి షాక్... మోసంచేసిన నైజీరియన్...

Sonakshi Verma : ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై మోసాలు చేస్తున్న వారు చాలా మంది. వారి ఉచ్చులో చిక్కుకుంటున్న బాధితుల లిస్టులో ఓ టాలీవుడ్ నటి కూడా చేరింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 6:28 AM IST
నటి సోనాక్షికి షాక్... మోసంచేసిన నైజీరియన్...
సోనాక్షి వర్మ (Image : instagram / i_sonakshiverma)
  • Share this:
సోనాక్షి వర్మ. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అందరికీ చేరువ అవ్వాలనే ఉద్దేశంతో... ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తోంది. ఐతే... ఓ రోజు ఆమెకు ఫేస్‌బుక్‌లో మెర్రిన్ కిర్రాక్ అనే యువతి నుంచీ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ అమ్మాయి లండన్‌లో ఉంటున్నట్లు తన అకౌంట్‌లో రాసుకుంది. అది చూసిన సోనాక్షి... రిక్వెస్టుకి ఓకే చెప్పింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో చాటింగ్ మొదలైంది. ఇలా కొన్ని రోజులు చాట్ చేసిన మెర్రిన్ కిర్రాక్... మీరు చాలా క్యూట్, డైనమిక్. నాకు మీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అని చెప్పింది. సోనాక్షీ ఆనందంగా ఫీలైంది. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్‌కి గుర్తుగా నేను మీకు ఓ గిఫ్ట్ పంపిస్తున్నాను అని చెప్పింది మెర్రిన్ కిర్రాక్. సోనాక్షి సరే అంది.

మే 27న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆఫీసర్‌ని అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. లండన్ నుంచీ మెర్రిన్ కిర్రాక్... మీ అడ్రెస్‌తో పార్శిల్ పంపారు. అది హైదరాబాద్‌లోని మీ అడ్రెస్‌కు చేరాలంటే కస్టమ్స్ డ్యూటీ, డెలివరీ ఛార్జీలు చెల్లించాలి అన్నాడు. ఎంత చెల్లించాలి అని అడిగింది సోనాక్షి. మొత్తం రూ.85వేలు అన్నాడు. అంత డబ్బు అడిగాడంటే... అది చాలా పెద్ద పార్శిలే, కాస్ట్‌లీ గిఫ్టే అయివుంటుంది అనుకుంది సోనాక్షి. అతను చెప్పిన అకౌంట్‌లో మనీ వేసింది.

డబ్బు చెల్లించి వారమైనా గిఫ్ట్ రాలేదు. ఆ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్‌కి కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. మనీ చెల్లించిన అకౌంట్ కూడా పనిచెయ్యట్లేదు. అప్పుడు అర్థమైంది... అప్పటిదాకా తాను చాట్ చేసింది నిజమైన అమ్మాయితో కాదనీ... అమ్మాయి పేరు పెట్టుకొని... ఎవరో చాట్ చేసి, చీట్ చేశారని. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి మొత్తం వివరించింది. నైజీరియన్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారన్న పోలీసులు... కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.
First published: June 13, 2019, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading