చిత్తూరు జిల్లాలో... తొమ్మిదో తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి

పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. పండుగకు ఇంటికి వెళ్లిన బాలికను ఫోన్ చేసి పిలిపించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: January 18, 2020, 5:35 PM IST
చిత్తూరు జిల్లాలో... తొమ్మిదో తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తన వద్ద చదువుకుంటున్న విద్యార్థిని మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. పండుగకు ఇంటికి వెళ్లిన బాలికను ఫోన్ చేసి పిలిపించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నగరి మండలం కేవీ పురం గ్రామానికి చెందిన గిరిజ.. మదనపల్లె గురుకుల పాఠశాలలో మాథ్స్ టీచర్ గా పని చేస్తోంది. ఈమె అక్క కుమారుడు టీవీ నవీన్ కుమార్.. గత పదేళ్లు గా గిరిజ వద్దే ఉంటున్నాడు. ప్రస్తుతం నవీన్ బి. కొత్తకోట ఏపి మోడల్ స్కూల్ లో తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు. కాగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె కు చెందిన ఓ విద్యార్థిని బి.కొత్తకోట ఏపి మోడల్ స్కూల్ లో 7వ తరగతి నుంచి చదువుతోంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని 9 వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని నీరుగట్టువారిపల్లిలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తెలుగు టీచర్ నవీన్ కుమార్ శుక్రవారం ఉదయం విద్యార్థినికి ఫోన్ చేసి పిలిపించుకుని మదనపల్లె గురుకుల పాఠశాలలోని తన పిన్ని గిరిజ క్వార్టర్స్ కు పిలుచుకు వెళ్లాడు. విద్యార్థిని పై పలుమార్లు లైంగిక దాడి చేసి ఇంటికి పంపాడు. ఉదయం నుంచి ఇంట్లో లేకుండా వెళ్లిపోయిన కుమార్తెను తల్లిదండ్రులు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిందుతున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 18, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading