• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TELUGU DESHAM PARTY LEADERS COMPLAINT TO SEC NIMMAGADDA RAMESH KUMAR OVER PHOTO OF AP CM YS JAGAN ON AP FIBER NET HOME SCREEN HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఆ ఛానల్లో సీఎం ఫోటోను తొలగించాల్సిందే... ఎస్ఈసీకీ టీడీపీ నేతల ఫిర్యాదు

AP Panchayat Elections: ఆ ఛానల్లో సీఎం ఫోటోను తొలగించాల్సిందే... ఎస్ఈసీకీ టీడీపీ నేతల ఫిర్యాదు

ఏపీ ఫైబర్ నెట్ పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Pacnhayat Elections) సందర్భంగా అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది.

  • Share this:
    పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దుచేయడం సరికాదంటూ వైసీపీ ఫిర్యాదు చేసిన 24గంటల్లోనే.. టీడీపీ మరో ఫిర్యాదును అందించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ ఫైబర్ నెట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తొలగించాలని టీడీపీ నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున సీఎం ఫోటో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సైబర్ నెట్ హోమ్ స్క్రీన్ ఫై డీఫాల్ట్ గా సీఎం ఫోటోను సెట్ చేశారని.. వెంటనే సీఎం ఫోటోను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొంది.

    మరోవైపు ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. శుక్రవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధంలేని పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టోను విడుదల చేయడం సరికాదని పేర్కొన్నారు. అలాగే ఒక రాజకీయ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని ఎన్నికల కమిషనర్ రద్దు చేయడం హాస్యాస్పదనమని.. నిబంధనలకు విరుద్ధం మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోకపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

    ఇప్పటికే ముఖ్యమంత్రి ఫోటోలు, వైసీపీ జెండాను పోలిన రంగులు ఉన్నాయన్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తిరగడానికి వీల్లేదని నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారు. వాహనాల రంగులు మార్చి రేషన్ డోర్ డెలివరీ చేయవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ విషయంలో టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎస్ఈసీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ హోం స్క్రీన్ ను పరిశీలించి మార్పులు సూచిస్తారా లేక వదిలేస్తారా అనేది వేచి చూడాలి.

    ఇదిలా ఉంటే గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించకుండా నిలుపుదల చేయాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎస్ఈసీ మాటలు విని ఏకగ్రీవాలు నిలిపేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎస్ఈసీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21వరకు గృహనిర్బంధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో డీజీపీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డపై ఘాటువ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు అసలు మైండ్ లేదని.. పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
    Published by:Purna Chandra
    First published: