Home /News /crime /

TELNGANA CRIME NEWS 9 PEOPLE FOUND IN FOUNDATION WALL IN 98 GOLD COINS NGS

Gold Coins: పునాదులు తవ్వుతుంటే బయటపడ్డ 98 బంగారు నాణేలు.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

పునాదులు తవ్వుతుంటే బయటపడ్డ 98 బంగారు నాణేలు

పునాదులు తవ్వుతుంటే బయటపడ్డ 98 బంగారు నాణేలు

ఇంటి నిర్మాణం కోసం తవ్వుతున్న పునాదుల్లో ఎవరూ ఊహించని విధంగా బంగారం బయట పడింది. దీంతో ఆ పునాదులు తవ్విన వారు అందులో 98 గోల్డ్ కాయిన్లను సొంతం చేసుకున్నారు. కానీ చివర్లో వారికి పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు..

    ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుంటే.. పెద్ద లంకె బిందులు బయట పడ్డాయి. దీంతో ఆశతో ఎందో ఉంటుందని ఆశపడి ఆ బిందెలు తెరిచి చూశారు. వారి ఊహించినట్టు వాటిల్లో బారీగా బంగారం నిధులు కనిపించాయి. ముఖ్యంగా ఒకటి రెండు కాదు 98 బంగారు నాణేలు దొరికాయి.. దీంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ జాతకం మారిపోతుంది అనుకున్నారు. కూలీ కోసం వస్తే జాక్ పాట్ కొట్టామని ఆనందంతో గంతులేశారు. వాటిని చూసుకుంటూ మురిసిపోతూ పండగ చేసుకున్నారు. తమకు లక్ కలిసి వచ్చిందని.. లక్ష్మీ దేవి కనక వర్షం కురిపించిందని సంబర పడ్డారు. సైలెంట్ గా అక్కడ దొరికిన బంగారాన్ని తొమ్మిది మంది వాటులు వేసుకుని మరీ పంచేసుకున్నారు. కానీ పోలీసులకు విషయం తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే.. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుంటే బంగారు నాణేలు ఉన్న బిందె బయటపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మండల కేంద్రమైన మనపాడులో జరిగింది. అలా తవ్వకాల్లో దొరికిన బంగారు నాణేలు తీసుకున్న తొమ్మిది మంది కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత విచారణ జరిపి వారి దగ్గర ఉన్న బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.

    పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. జనార్దన్‌రెడ్డికి చెందిన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బంగారు నాణేలు బయటపడినట్లు మీడియా కథనాలు వచ్చాయి. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటినిర్మాణ పనుల్లో పాల్గొన్న తొమ్మిది మంది కూలీలను అదుపులోకి తీసుకుని విచారించి వారిని అదుపులోకి తీసుకున్నారు..

    పునాదులు తవ్వుతుంగా బిందె బయటపడిందని, అందులో 98 బంగారు నాణేలు ఉన్నాయని కూలీలు విచారణలో అంగీకరించారు. బంగారు నాణేల విషయం ఇంటి యజమానికి చెప్పకుండా తామే పంచుకున్నామని కూలీలు ఒప్పుకున్నారు. ఒక్కో బంగారు నాణెం సుమారు 3 గ్రాముల ఉందని తెలిపారు. బంగారు నాణేలను కొందరు ఆభరణాల రూపంలోకి మార్చుకోగా, మరి కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. కూలీల దగ్గర నుంచి 12.12 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వివరించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Crime news, Gold ornmanets, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు