అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు.. మృత్యువుతో పోరాటం

కొందరు దోపిడీ దొంగలు గన్‌తో సాయికృష్ణను బెదిరించారు. అతని కారులో ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతని వద్ద ఉన్న కారు, పర్సు, ఇతర వస్తువులను తీసుకున్నారు.

news18-telugu
Updated: January 6, 2019, 6:10 PM IST
అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు.. మృత్యువుతో పోరాటం
సాయికృష్ణ (File:ANI)
  • Share this:
అమెరికాలో తెలుగు యువకుడి మీద కొందరు దుండుగులు కాల్పులు జరిపారు. దోపిడీ కోసం వచ్చిన వారు అతడి వద్ద ఉన్న డబ్బు, కారు దోచుకోవడంతో పాటు అతడి మీద కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు, ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. తెలంగాణకు చెందిన సాయికృష్ణ ఎలక్ట్రికల్ ఇంజినీర్. సౌత్ ఫీల్డ్ మిచిగాన్‌లోని లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. డెట్రాయిట్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి మూడో తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు. తర్వాత తినడానికి రోడ్డు పక్కన ఆహారం కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో కొందరు దోపిడీదొంగలు అడ్డుపడ్డారు.

కొందరు దోపిడీ దొంగలు గన్‌తో సాయికృష్ణను బెదిరించారు. అతని కారులో ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతని వద్ద ఉన్న కారు, పర్సు, ఇతర వస్తువులను తీసుకున్నారు. అంతటితో వదిలిపెట్టుకుండా అతడి మీద కాల్పులు జరిపి.. కారుతో పరారయ్యారు. రోడ్డు మీద వెళ్తున్న వారు.. అర్ధరాత్రి పూట చలిలో బుల్లెట్ గాయాలు తగిలిన సాయికృష్ణను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితుడిని డెట్రాయిట్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో సాయికృష్ణకు చికిత్స జరుగుతోంది. ఇప్పటకే పలు ఆపరేషన్లు చేసినట్టు అతని స్నేహితుడు సృజిత్ తెలిపాడు. ఎంతో కష్టపడి మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన సాయికృష్ణ ఇలా దుండగుల కాల్పుల్లో గాయపడ్డాడు. సాయికృష్ణకు ఆస్పత్రిలో చికిత్సకు డబ్బులు సమకూర్చేందుకు అతడి స్నేహితులు సపోర్ట్ సాయికృష్ణ అంటూ ‘గోఫండ్ మీ’ ద్వారా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. 250 మిలియన్ డాలర్లు టార్గెట్‌గా పెట్టుకోగా, 100 మిలియన్ డాలర్లు సమకూరాయి.
First published: January 6, 2019, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading