హోమ్ /వార్తలు /క్రైమ్ /

కుటుంబానికి అన్నీతానై.. తెలంగాణ యువకుడు దుబాయిలో గొంతు కోసుకుని..

కుటుంబానికి అన్నీతానై.. తెలంగాణ యువకుడు దుబాయిలో గొంతు కోసుకుని..

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయంలో ఆందోళన వద్దని తాము చెప్పినా.. లక్ష్మణ్ వినలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

అక్కకు పెళ్లి చేయగా, చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది. రాజేశ్ పెళ్లి చేసుకోవడం.. పలు కారణాలతో విడాకులు కూడా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దుబాయికి వెళ్లాడు.

  చిన్నతనంలోనే ఓ యువకుడి తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచీ తల్లి సహకారంతో కుటుంబ భారానంతా నెత్తిన ఎత్తుకున్నాడు. ఓ అక్కకు పెళ్లి చేశాడు. చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది. తాను పెళ్లి చేసుకున్నాడు. కానీ కొద్దిరోజులకే పలు కారణాల నేపథ్యంలో విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దుబాయి వెళ్లాడు. డబ్బు సంపాదించి చెల్లి పెళ్లి చేయడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని భావించాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మానసిక వేదనతో దుబాయిలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి రాజేశ్(26) చిన్న వయస్సులోనే తండ్రి చనిపోయాడు. తల్లి సహకారంతో కుటుంబ బాధ్యతలన్నీ తానే తీసుకున్నాడు.

  ఈ క్రమంలో ఓ అక్కకు పెళ్లి చేయగా, చెల్లికి పెళ్లి చేయాల్సి ఉంది. రాజేశ్ పెళ్లి చేసుకోవడం.. పలు కారణాలతో విడాకులు కూడా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దుబాయికి వెళ్లాడు. కానీ అక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు అతడిని వేధించసాగాయి. ఈ క్రమంలోనే తరచూ అతడి సహచరులతో తనకు అండగా ఎవరూ లేరని, ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నానని చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం కుటుంబ సభ్యులు, బంధువులందరితో ఫోనులో మాట్లాడాడు.

  ఆ రోజే ఓ ట్రావెల్ అద్దెకు తీసుకుని ఏడారిలో నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ట్రావెల్‌కు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో అతడి సెల్ ఫోన్ ఇచ్చి కంపెనీలో చూపిస్తే డబ్బులు ఇస్తారని చెప్పి పంపాడు. అనంతరం అక్కడే పదునైన ఆయుధంతో గొంతు చేతుల మీద కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

  Published by:Anil
  First published:

  Tags: Dubai, Suicide, Telangana

  ఉత్తమ కథలు