అమ్మా.. నన్ను క్షమించు.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య..

ఆ వాయిస్ రికార్డులో తాను పనిచేయలేక చచ్చిపోట్లేదని, మనసులో ఏదో తెలియని బాధ ఉందని చెప్పుకొచ్చాడు. విషాద స్వరంతో అక్కలు, నాన్నను మంచిగ చూసుకోవాలంటూ.. తాను చనిపోయినందుకు ఎవరూ ఏడ్వొద్దంటూ కోరాడు.

news18-telugu
Updated: July 15, 2020, 7:14 AM IST
అమ్మా.. నన్ను క్షమించు.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
‘అమ్మా.. నన్ను క్షమించు. అక్క, నాన్నను మంచిగ చూసుకో. నేను పనిచేయలేక చచ్చిపోట్లే. నా గుండెలో ఎట్నో అన్పిస్తోంది. చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను ఈడనే కాలుస్తరో ఏమో. నాకోసం ఎవరూ ఎడ్వొద్దు. అక్కలను మంచిగా చూసుకో..’ అంటూ ఓ యువకుడు ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి తెలంగాణకు చెందిన యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌కు చెందిన విట్టల వెంకటి, లక్ష్మి భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు నవీన్(22) ఉన్నారు. అయితే నవీన్ ఆరు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడే కూలిగా పనిచేస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆకస్మాత్తుగా తన గదిలో తాడుతో ఉరేసుకుని చనిపోయాడు.

అయితే ఆత్మహత్యకు ముందు నవీన్ తన ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి, దాన్ని తన తల్లికి పంపాలని స్నేహితుడిని కోరాడు. ఆ వాయిస్ రికార్డులో తాను పనిచేయలేక చచ్చిపోట్లేదని, మనసులో ఏదో తెలియని బాధ ఉందని చెప్పుకొచ్చాడు. విషాద స్వరంతో అక్కలు, నాన్నను మంచిగ చూసుకోవాలంటూ.. తాను చనిపోయినందుకు ఎవరూ ఏడ్వొద్దంటూ కోరాడు. తన అంత్యక్రియలను బహ్రెయిన్‌లోనే చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు.

అయితే నవీన్‌కు కరోనా సోకి.. ఆ భయంతోనే మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. నవీన్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. నవీన్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను కోరారు.
Published by: Narsimha Badhini
First published: July 15, 2020, 7:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading