• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TELANGANA WORKER COMMITS SUICIDE AFTER LANDLORD ATTACKED HIM IN RAJANNA SIRCILLA DISTRICT SU KNR

Telangana: అమానుషం.. పనికిరాలేదని చితకబాదిన భూస్వామి.. అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్న పాలేరు..

Telangana: అమానుషం.. పనికిరాలేదని చితకబాదిన భూస్వామి.. అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్న పాలేరు..

ప్రతీకాత్మక చిత్రం

రెండు రోజులు పనికి రానందుకు ఓ భూస్వామి పాలేరును ఇంటికి పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అంతేకాకుండా కులం పేరుతో దూషించాడు.

  • Share this:
    రెండు రోజులు పనికి రానందుకు ఓ యజమాని పాలేరును ఇంటికి పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అంతేకాకుండా కులం పేరుతో దూషించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక పాలేరు పురుగుల మందు తాగాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు . ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పెల్లి మండలం కొదురుపాక గ్రామపంచాయతీ పరిధిలోని నీలోజీపల్లెలోచోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎరవెల్లి శంకర్(40) నీలోజిపల్లెకు చెందిన భూస్వామి అనుమల శ్రీనివాస్ రెడ్డి దగ్గర పదేండ్ల నుంచి పాలేరుగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా రెండ్రోజుల కిందట శంకర్ పనికి రాలేదు. దాంతో ఆగ్రహం చెందిన భూస్వామి ఉన్న ఫలంగా శనివారం శంకర్‌ను ఇంటికి పిలిపించి ఇష్టం వచ్చినట్టు భూతులు తిట్టడమే కాక గొడ్డును బాదినట్టు బాదాడు.

    అంతేకాకుండా కులం పేరుతో దూషించాడు. దీంతో అవమానానికి గురైన బాధితుడు శంకర్ అక్కడే పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు . ఈ విషయాన్ని బాధితుడి భార్య రాజేశ్వరికి సమాచారం ఇవ్వడంతో బంధువులతో కలిసి వచ్చిన ఆమె శంకర్‌ను రాజన్న సిరిసిల్ల ఏరియాస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శంకర్ నిన్న రాత్రి మృతిచెందాడు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు బోయినిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా, శంకర్ మృతికి కారణమైన భూస్వామి శ్రీనివాస్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి రూ .10 లక్షలు ఇవ్వాలని పలు కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published: