కొన్ని సంవత్సరాల క్రితం వారిద్దరికి వివాహం జరిగింది. మొదటి నుంచి వారు అన్యోనంగా జీవిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా కాపురం సాగిపోతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతడు అప్పుడప్పుడు ఎలక్ట్రిషన్ పని కూడా చేస్తుంటాడు. ఓ రోజు అదే గ్రామంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిషన్ పని ఉంది.. వెళ్తున్నా అని చెప్పి భార్యకు చెప్పాడు. ఆమె ఈ రాత్రి వెళ్లొద్దు ఉదయం వెళ్లండి అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. వెంటనే వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి అతడి భార్య దూలానికి వేలాడుతూ కనిపించింది. అమ్మను చూస్తూ పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని చిత్తాపూర్ తాలుకా నల్సార్ గ్రామానికి చెందిన వడ్డె సిద్దు, రేణుక(26) దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి గ్రామానికి వలస వచ్చారు.
వీరికి పిల్లలు అంజలి, లక్ష్మణ్ ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఓ రోజు రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎలక్ట్రిషన్ పనులు చేయడానికి తాను వెళ్తున్నట్లు సిద్దు భార్య రేణుకకు చెప్పాడు. అయితే రాత్రి సమయంలో పనికి వెళ్లొద్దని భార్య సిద్దును వారించింది. అయినా వినకుండా సిద్దు త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన సిద్దుకి ఇంట్లో దూలానికి వేలాడుతూ రేణుక నిర్జీవంగా కనిపించింది. జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారమిచ్చాడు. రేణుక మాట వినకుండా సిద్దు పనికి వెళ్లడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి వెంకటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Crime news, Vikarabad