వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. చిలకా గోరింకలా కలిసి మెలిసి జీవనం సాగించారు.. చూడముచ్చటగా ఉన్న జంటను చూసి కొంతమంది కుళ్లుకున్నారు కూడా.. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ఏమైందో ఏమో గానీ, ఒకరిపై ఒకరు నిందించుకోవడం మొదలుపెట్టారు.. ఆ లొల్లి పంచాయితీ దాకా వెళ్లింది.. పెద్దోళ్లు సర్ది చెప్పితే రెండు, మూడ్రోజులు బాగానే ఉండేవారు.. ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ గొడవపడేవారు.. ఇద్దరి మధ్య పెరిగిన అఘాతం ఒకరి హత్యకు దారి తీసింది.. భర్తను వదిలించుకుందామని ఏకంగా భార్యే అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఇల్లెందు పట్టణంలోని వినోబాకాలనీలో నివాసం ఉంటున్న నక్కా కల్యాణ్(28) కొన్నేళ్ల క్రితం నిజాంపేటకు చెందిన శైలజను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరిద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి గొడవలు జరిగి.. పెద్దల పంచాయితీ వరకు వెళ్లింది.
అయితే, బుధవారం రాత్రి 2 గంటలకు కల్యాణ్ నిద్రిస్తుండగా శైలజపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కేకలు పెట్టుకుంటూ కల్యాణ్ పరుగులు పెట్టాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలార్పి బాధితుడిని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.