Home /News /crime /

TELANGANA VIDYAVANTULA VEDIKA LEADER GURIJALA RAVINDER ARRESTED IN MANCHERIAL SU ADB

Telangana: మావోలకు సహకరిస్తున్నాడని విద్యావంతుల వేదిక నేత రవీందర్‌రావు అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు

మీడియాలకు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

మీడియాలకు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురిజాల రవీందర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మావోలకు ఆశ్రయం కల్పించాడని పోలీసులు తెలిపారు.

    తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురిజాల రవీందర్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం గురిజాల రవీందర్ రావును అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపుర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం సీసీ సత్యనారాయణ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గురిజాల రవీందర్రావు గతంలో మావోయిస్టు అనుబంధ సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య( సికాస )లో తొలి కార్యదర్శిగా పని చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నరని అన్నారు.

    ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారని అలాగే మావోయిస్టులకు షెల్టర్ ఇస్తున్నాడని తెలిపారు. గురిజాల రవీందర్రావు అతని హోటల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడైన వారణాసి సుబ్రహ్మణ్యం అతడి భార్యకు 20 రోజులపాటు ఇక్కడ ఆశ్రయం కల్పించారని పేర్కొన్నారు. రవీందర్ రావును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రెండు మెమోరి కార్డులు, మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

    ఇక, రవీందర్‌రావును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పొల్గొన్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కార్యదర్శి నారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. రవీందర్ రావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Mancherial, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు